Advertisementt

టాలీవుడ్ మెగా మీటింగ్.. వారిద్దరూ సైలెంట్

Sun 20th Feb 2022 07:58 PM
tollywood,megastar chiru,mohan babu,rajamouli,natti kumar,prasanna kumar,c kalyan,tammareddy  టాలీవుడ్ మెగా మీటింగ్.. వారిద్దరూ సైలెంట్
Chiru and Mohan Babu missing in Tollywood meeting టాలీవుడ్ మెగా మీటింగ్.. వారిద్దరూ సైలెంట్
Advertisement
Ads by CJ

ఈ రోజు ఆదివారం టాలీవుడ్ లో కీలక సమావేశం జరుగనుంది అని, ఈ సమావేశానికి మెగాస్టార్ చిరు, మోహన్ బాబు కూడా హాజరవుతారని ప్రచారం జరిగింది. ఎందుకంటే మొన్నామధ్యన సీఎం జగన్ తో మెగాస్టార్ అధ్యక్షతన స్టార్ హీరోలు హాజరైన మీటింగ్ ని మంచు ఫ్యామిలీ కాస్త కాంట్రవర్సీ చెయ్యడంతో.. ఈ రోజు టాలీవుడ్ లో జరగబోయే మీటింగ్ పై అందరిలో ఇంట్రెస్ట్ జెనరేట్ అయ్యింది. ఈ మీటింగ్ లో ఎలాంటి అంశాలు లేవనెత్తుతారు. ఎవరెవరు హాజరవుతారనే దానిమీద అందరిలో ఉత్సుతక మొదలైనా.. ఆ సమావేశానికి చిరు, మోహన్ బాబు ఇద్దరూ హాజరవలేదు.

రాజమౌళి, తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ, ప్ర‌స‌న్న కుమార్‌, సి.క‌ళ్యాణ్‌, న‌ట్టి కుమార్ వంటి వారు హాజరైన ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయో అనుకుంటే.. కరోనా పాండమిక్ తర్వాత నిర్మాతలు, దర్శకులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ ఫేస్ చేస్తున్న అంతర్గత సమస్యలపైనే ఈ మీటింగ్‌లో చ‌ర్చించ‌బోతున్నాం. అంతే కానీ.. ఈ సమావేశంలో టికెట్ రేట్స్‌ ఇష్యు, ఇత‌ర‌త్ర సినీ ప‌రిశ్ర‌మ‌లోని స‌మ‌స్య‌ల‌పై మాట్లాడ‌బోవ‌డం లేదు అంటూ ఫిల్మ్ చాంబ‌ర్ సెక్ర‌ట‌రీ చెప్పడంతో.. ఈ మీటింగ్ పై ఉన్న ఊహాగానాలు తుస్ మన్నాయి.

అలాగే సినీ ఇండ‌స్ట్రీ పెద్ద ఇక్కడ ఎవరూ లేరని, ఇండ‌స్ట్రీ పెద్ద ఫిలిం చాంబ‌ర్ మాత్ర‌మే అని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ స‌హా ఇత‌ర 24 శాఖ‌లు క‌లిస్తేనే ఇండ‌స్ట్రీ, ఇందులోని స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డానికే ఈ మీటింగ్ అంటూ మరో నిర్మాత ప్రసన్న కుమార్ చెప్పారు. ఇక ఈ మీటింగ్ కి 24 క్రాఫ్ట్ ల నుండి 250 మందిని ఆహ్వానిస్తే.. పట్టుమని100 మంది కూడా హాజరవలేదు.

Chiru and Mohan Babu missing in Tollywood meeting:

Tollywood meeting highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ