Advertisementt

పవన్ కళ్యణ్ కి తప్పిన పెను ప్రమాదం

Sun 20th Feb 2022 05:39 PM
pawan kalyan,public meeting,roadshow,pawan fans,narsapuram  పవన్ కళ్యణ్ కి తప్పిన పెను ప్రమాదం
Jana Sena Party Chief Pawan Kalyan Roadshow పవన్ కళ్యణ్ కి తప్పిన పెను ప్రమాదం
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ని రాజకీయాల్లో సపోర్ట్ చెయ్యకపోయినా.. హీరోగా ఆయన్ని అభిమానించే అభిమానులను కొలమానంలో కావడం చాలా కష్టం. అటు సినిమాలు ఇటు రాజకీయాలతో పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉంటున్నారు. రాజకీయాల్లో భాగంగా నేడు పవన్ కళ్యాణ్ నరసాపురంలో మత్స్యకారుల సభలో ప్రసంగించడానికి వెళ్లగా అక్కడ ఆయనకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. పవన్ రోడ్డు మార్గం ద్వారా నరసాపురం బయల్దేరారు. రాజమండ్రి నుంచి పవన్ రావులపాలెం, సిద్ధాంతం, పాలకొల్లు మీదుగా నరసాపురం చేరుకుంటారు. పవన్ కు రోడ్డు మార్గంలో అభిమానులు, జనసైనికులు నీరాజనాలు పలికారు. అయితే పవన్ కళ్యాణ్ రోడ్ షో లో అభిమానులని పలకరించే ఉద్దేశ్యంతో కారు పైకి ఎక్కి అభిమానులకి అభివాదం చేస్తుండగా.. ఓ అభిమాని అనుకోకుండా పవన్ ఉన్న కారు పైకి ఎక్కి పవన్ కళ్యాణ్ ని కలిసే ప్రయత్నం చేసాడు.

ఆ అభిమాని పవన్ ని కలిసే ప్రయత్నంలో అతన్ని కొంతమంది కిందకి లాగగా.. ఆ అభిమానితో పాటుగా పవన్ కూడా కారు మీద పడిపోయారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ ఒకింత షాకయినా.. వెంటనే ఆయన సర్దుకుని మళ్ళీ కారు పైన నించున్నారు. ఆ అభిమాని చేసిన పనికి పవన్ కళ్యాణ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. పవన్ ని కలిసే క్రమంలో ఆ అభిమాని పవన్ కళ్యాణ్ చెయ్యి పట్టుకోగా.. ఆ అభిమానిని కిందకి లాగే క్రమంలోనే అతనితో పాటుగా పవన్ కూడా కారు పై నుండి కిందకి పడిపోయేవారే. కానీ పవన్ చాకచక్యంతో మళ్లీ నిలదొక్కుకుని నిలబడ్డడంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Jana Sena Party Chief Pawan Kalyan Roadshow:

Pawan Kalyan Public Meeting at Narsapuram 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ