Advertisementt

భీమ్లా వస్తుందంటే రిలీజ్ ఆపేసేవాడిని

Sun 20th Feb 2022 09:23 AM
rx 100 hero karthikeya gummakonda in valimai,ajith valimai releasing on february 24th,bheemla nayak releasing on february 25rh,competition between bheemla nayak and valimai  భీమ్లా వస్తుందంటే రిలీజ్ ఆపేసేవాడిని
Karthikeya about Competition with Bheemla Nayak భీమ్లా వస్తుందంటే రిలీజ్ ఆపేసేవాడిని
Advertisement
Ads by CJ

RX 100 చిత్రంతో తెరపైకి వచ్చి ఆపై హీరోగా మరో హిట్టు కొట్టలేక విలన్ పాత్రలకైనా సిద్ధపడ్డాడు కార్తికేయ. ఆల్ రెడీ నానీస్ గ్యాంగ్ లీడర్ లో నెగెటివ్ క్యారెక్టర్ చేసిన కార్తికేయ ఇపుడు తమిళ స్టార్ అజిత్ వలిమై సినిమాలో ఇంకా పవర్ ఫుల్ విలన్ రోల్ చేసాడు. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 24 న విడుదల అవుతోన్న సందర్భంగా మీడియాతో ముచ్చటించిన కార్తికేయ పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు.

RX 100 చూసి వలిమై డైరెక్టర్ వినోద్ ఫోన్ చేసారు. నా పెరఫార్మెన్స్ అండ్ ఫిజిక్ నచ్చిందని చెప్పి ఈ క్యారెక్టర్ ఆఫర్ చేసారు. చాలా వేరియేషన్స్ చూపించే సైకో విలన్ పాత్ర అది. నటుడిగా నాకిదో ఛాలెంజ్ అనిపించింది. అందులోను అజిత్ సర్ సినిమా అంటే రీచ్ ఎంత ఎక్కువ ఉంటుందో తెలిసిందే. ఆయనతో కలిసి నటించడం నిజంగా  గ్రేట్ ఎక్సపీరియన్స్. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ వేరే రేంజ్ లో ఉంటాయి. 80 పర్శంట్ డూప్ లేకుండా ఒరిజినల్ గానే చేశాను. కొన్ని దెబ్బలు కూడా తగిలాయి. బట్ ఫైనల్ అవుట్ ఫుట్ చూసాక వెరీ వెరీ హ్యాపీ. ఈ 24 కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పారు కార్తికేయ.

వలిమై రిలీజ్ అయిన మరుసటి రోజునే భీమ్లా నాయక్ వస్తుండడంపై కార్తికేయ స్పందిస్తూ.. నేను కూడా చాలా రోజుల్నుంచీ భీమ్లా నాయక్ కోసం ఎదురు చూస్తున్నా. కానీ 25 న వస్తుందనుకోలేదు. అది ముందే తెలిసి ఉంటే వలిమై తెలుగు రిలీజుని వన్ వీక్ అయినా ఆపించేవాడిని. అయినా పవన్ సర్ అజిత్ సర్ ఇద్దరు ఇద్దరే. ఇక్కడ కళ్యాణ్ గారికి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ తమిళ్ లో అజిత్ సర్ కూడా సేమ్. రెండు సినిమాలు పెద్ద హిట్టవుతాయని అనుకుంటున్నా అన్నారు. 

Karthikeya about Competition with Bheemla Nayak :

RX 100 Hero Karthikeya Gummakonda As Psycho villain in Valimai

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ