Advertisementt

ప్రభాస్ పై ఫాన్స్ కంప్లైంట్

Sat 19th Feb 2022 08:47 PM
prabhas,prabhas fans,uv creations,radhe shyam promotions,radhe shyam movie  ప్రభాస్ పై ఫాన్స్ కంప్లైంట్
Fans complain of Prabhas ప్రభాస్ పై ఫాన్స్ కంప్లైంట్
Advertisement
Ads by CJ

రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. జనవరి 14 నే రావాల్సింది.. కానీ ఏం చేస్తాం కరోనా అడ్డు పడింది. దానితో ప్రభాస్ ఫాన్స్ డిస్పాయింట్ అయ్యారు. మళ్లీ మార్చ్ 11 న రాధే శ్యామ్ రిలీజ్ అని ప్రకటించినప్పటినుండి ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. రిలీజ్ కి టైం దగ్గర పడుతున్నా ప్రమోషన్స్ లో చురుకు లేదు. డిసెంబర్ లోనే అన్ని భాషలకి కలిపి ఫాన్స్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని భారీగా చేసారు మేకర్స్. ఈమద్యలో సాంగ్స్ రిలీజ్ ఉంటుంది కానీ.. ఓ పోస్టర్ కానీ, ఓ టీజర్ కానీ లేదు.

అసలే పాండమిక్ సిట్యువేషన్ లో ప్రమోషన్స్ ఓ రేంజ్ లో లేకపోతె పాన్ ఇండియా మార్కెట్ లో కష్టం. కానీ ప్రభాస్ ఎప్పుడూ చేసే తప్పు చేస్తున్నాడని ప్రభాస్ ఫాన్స్ కంప్లైంట్. ఇటు రాధే శ్యామ్ ప్రమోషన్స్ వదిలేసి ప్రాజెక్ట్ కే షూటింగ్ లో ప్రభాస్ బిజీ అయ్యారు. రాధేశ్యామ్ రిలీజ్ కి ఇంకా 15 డేస్ మాత్రమే టైం ఉంది. ఈలోపు అన్ని భాషల్లో ఒక్కో ప్రెస్ మీట్ పెడితే బావుంటుంది అనేది ఫాన్స్ కోరిక. అలాగే రాధే శ్యామ్ నుండి మరొక ట్రైలర్ వదిలితే బావుంటుంది.. యువి క్రియేషన్స్ కి ప్రమోషన్స్ ఎలా చెయ్యాలో తెలియదు.. బాహుబలి చేసిన ప్రభాస్ కి తెలుసు కదా.. ప్రమోషన్స్ సినిమా విజయంలో ఎంతో కీలకం. ప్రభాస్ ప్లీజ్ కాస్త చూసుకో అంటున్నారు ఫాన్స్.

Fans complain of Prabhas:

Delay in Radhe Shyam Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ