Advertisementt

బన్నీ మళ్లీ టెంక్షన్ పెడుతున్నాడా?

Sat 19th Feb 2022 06:34 PM
allu arjun,pushpa 2,sukumar,bunny,allu arjun meeting,pushpa 2 team,pushpa 2 release date  బన్నీ మళ్లీ టెంక్షన్  పెడుతున్నాడా?
Bunny is tense again బన్నీ మళ్లీ టెంక్షన్ పెడుతున్నాడా?
Advertisement
Ads by CJ

గత ఏడాది పుష్ప రిలీజ్ డేట్ ఇచ్చి అల్లు అర్జున్ సుకుమార్ ని ఇరికించేసాడు. షూటింగ్ సమయంలో బన్నీకి కరోనా రావడం, తర్వాత సెకండ్ వేవ్, ఆ తర్వాత సుకుమార్ డెంగ్యూ ఫీవర్ బారిన పడడంతో.. షూటింగ్ అలా అలా లేట్ అయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో నానా తంటాలు పడి.. ఆఖరికి సుకుమార్ పుష్ప ప్రమోషన్స్ కి కూడా రాలేకపోయారు. అలాగే బన్నీ కూడా హడావిడి ప్రమోషన్స్ తో పుష్ప ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేసాడు. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ విషయంలో అలా జరగకూడదని బన్నీ పుష్ప టీం ని పిలిచి మీటింగ్ పెట్టి మరీ సలహాలు, సూచనలు ఇచ్చాడట. 

పుష్ప ద రూల్ షూటింగ్ చకచకా ముగించేసి, పోస్ట్ ప్రొడక్షన్ కూల్ గా చేసి.. ప్రమోషన్స్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి.. అన్నీ ఓ పద్దతి ప్రకారం చెయ్యాలని పుష్ప పార్ట్ టీం కి బన్నీ చెప్పారట. అలాగే నటుల కాల్షీట్స్ ని కూడా ముందే తీసుకోవాలని, మళ్లీ వాళ్ళు వేరే సినిమాలకి కమిట్ అయితే కష్టం కాబట్టి.. ఈసారి ఏ విషయంలోనూ కంగారు పడవద్దని.. పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అవ్వగానే.. అనుకున్న టైం కి ఫినిష్ చేసేలా ఉండాలని, అలాగే త్వరలోనే ఓ రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకుని అధికారిక ప్రకటన ఇవ్వాలని కూడా బన్నీ చెప్పాడట. అంటే మళ్లీ పుష్ప టీం ని బన్నీ టెక్షన్ పెడుతున్నట్లే కనిపిస్తున్నా.. ఇప్పుడు రిలీజ్ డేట్స్ గందర గోళంలో ముందే డేట్ ఫిక్స్ చేసుకున్న ఉత్తమం మరొకటి ఉండదు. 

Bunny is tense again:

Allu Arjun wants to Pushpa 2 shooting on time

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ