Advertisementt

భీమ్లా ట్రైలర్ స్ట్రోమ్ వచ్చేస్తుంది

Sat 19th Feb 2022 04:58 PM
bheemla nayak,bheemla nayak trailer,pawan kalyan,rana,trivikram,  భీమ్లా ట్రైలర్ స్ట్రోమ్ వచ్చేస్తుంది
Bheemla Nayak Trailer treat on భీమ్లా ట్రైలర్ స్ట్రోమ్ వచ్చేస్తుంది
Advertisement
Ads by CJ

లాలా భీమ్లా అంటూ పవన్ ఫాన్స్ కి పూనకాలు తెప్పించే అప్ డేట్స్ తో భీమ్లా నాయక్ మేకర్స్ హడావిడి మొదలు పెట్టేసారు. ఈ నెల 25 న రిలీజ్ డేట్ ఇచ్చి.. భీమ్లా నాయక్ ని గ్రాండ్ గా తెలుగు, హిందీలలో రిలీజ్ కి కావాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయారు. కేవలం వారం మాత్రమే భీమ్లా రిలీజ్ కి టైం ఉండడంతో.. మేకర్స్ ప్రమోషన్స్ ని పరుగులు పెట్టిస్తున్నారు. రోజుకో పవర్ ఫుల్ పోస్టర్ తో ఆడియన్స్ లో అంచనాలు రేపుతున్నారు. ఇప్పటివరకు పవన్ మ్యానియాతో సినిమాపై హైప్ క్రియేట్ చేసి.. ఇప్పుడు అన్ని రకాలుగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. రానా - పవన్ పోస్టర్స్ తో ఫాన్స్ కి ఊపిరాడకుండా చేస్తున్నారు. 

ఈ నెల 21 సాయంత్రం జరగబోయే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కేటీఆర్ ని ఆహ్వానించి.. ఆయనకి దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత చినబాబు థాంక్స్ చెప్పి వచ్చిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

అలా ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే భీమ్లా నాయక్ ట్రైలర్ స్ట్రోమ్ అప్ డేట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసారు. అది కూడా పవన్ కళ్యాణ్ బైక్ మీద వస్తున్న పవర్ ఫుల్ స్టిల్ తో భీమ్లా నాయక్ ట్రైలర్ స్ట్రోమ్ ఈ నెల 21 అంటే సోమవారం రిలీజ్ చెయ్యబోతున్న విషయాన్ని ప్రకటించారు. A peek into the Ultimate face-off of DUTY and POWER 🌟💪 భీమ్లా నాయక్ ట్రైలర్ ఆన్ ద వే అంటూ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్ ని షేర్ చేసారు మేకర్స్. 

Bheemla Nayak Trailer treat on:

Bheemla Nayak Trailer released on February 21

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ