Advertisementt

చిరు కలిస్తే అలా.. మీరు కలిస్తే ఇలా..

Sat 19th Feb 2022 03:53 PM
mohan babu,megastar chiru,cm jagan,manchu vishnu,jagan  చిరు కలిస్తే అలా.. మీరు కలిస్తే ఇలా..
Netizens trolls on Manchu Mohan Babu చిరు కలిస్తే అలా.. మీరు కలిస్తే ఇలా..
Advertisement
Ads by CJ

ఇండస్ట్రీ సమస్యలపై మెగాస్టార్ చిరు జగన్ ని కలిసి మీట్ అయ్యి లంచ్ చేసి ఇండస్ట్రీ విషయాలు మాట్లాడి వస్తే.. అది ఆయన వ్యక్తి గత మీటింగ్ ఇండస్ట్రీ అంతా కలిసి వెళితేనే.. ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారం అవుతాయంటూ ప్రస్తుత మా అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడారు. మొన్నటికి మొన్న సీఎం జగన్ తో సమావేశం కోసం మెగాస్టార్ తో కలిసి మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి లాంటి స్టార్స్ వెళ్లారు. అక్కడ కూడా సీఎం ఆహ్వానం వచ్చినా మాకు అందనివ్వలేదని తండ్రి కొడుకులు మీడియా ముందు మోర పెట్టుకున్నారు. 

మంచు విష్ణు మా అధ్యక్షుడు హోదాలో జగన్ తో మీట్ అయ్యి లంచ్ చేసి.. ఆ విషయం గర్వంగా ట్వీట్ కూడా చేసారు విష్ణు. దానితో మంచు మోహన్ బాబు ని, మంచు విష్ణు నెటిజెన్స్ తెగ ట్రోల్ చేసారు. ఆ ట్రోల్స్ కి బాధపడిన మోహన్ బాబు.. ఏ సీఎం జగన్ ని మా అబ్బాయి కలవకూడదా.. జగన్ మా అబ్బాయికి బావమరిది అవుతాడు. మంచు విష్ణు ని ఎంతో ఆప్యాయంగా చూస్తాడు. ఆయనతో భోజనం చేయకూడదా.. లంచ్ టైం లో ఇండస్ట్రీ సమస్యలపై ఎన్నో రకాల మాటలు వస్తాయి మట్లాడకూడాదా.. మరి మోహన్ బాబు గారు చెప్పింది నిజమే.. జగన్ తో మీటింగ్ అంటే సినిమా ఇండస్ట్రీ గురించి పిచ్చా పాటి మాట్లాడుకుంటారు. మరి మీరు చేస్తే కరెక్ట్, మెగాస్టార్ చేస్తే రాంగా.. ఆయనిది వ్యక్తిగత మీటింగ్ అయినప్పుడు.. మీదేం మీటింగ్ సర్ అంటూ నెటిజెన్స్ మంచు బాబులని నిలదీస్తున్నారు.

Netizens trolls on Manchu Mohan Babu:

Mohan Babu reacts on Manchu Vishnu - Jagan Meeting

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ