తెలుగు ఓటిటీలలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న ఆహా నుండి ప్రతి వారం ఏదో సినిమా రిలీజ్ అవడమే కాదు.. వెబ్ సీరీస్ లు, టాక్ షోస్ లాంటివి తరచూ వస్తూనే ఉన్నాయి. ఆహాకి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో అదిరిపోయే క్రేజ్ తీసుకువచ్చింది. ఆహా కి ఎంత పేరొచ్చినా.. ఇంతవరకు ఆహా నుండి పెద్ద స్టార్స్ సినిమాలు రాలేదనే చెప్పాలి. కానీ ఫస్ట్ టైం ఆహా ఓటీటీకి ఓ బిగ్ స్టార్ బిగ్ బడ్జెట్ సినిమా తగిలింది. అదే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ డిజిటల్ హక్కులని ఆహా ఎద్భుతమైన ఫ్యాన్సీ డీల్ కి దక్కించుకుంది అని, ఆహా కెరీర్ లోనే ఇదే బిగ్గెస్ట్ డీల్ గా చెబుతున్నారు.
యు/ఏ సర్టిఫికెట్ తో భీమ్లా బరిలోకి దిగుతుంది. ఫిబ్రవరి 25 న ఆడియన్స్ ముందుకు రాబోతున్న భీమ్లా నాయక్ క్రేజ్ మాములుగా లేదు. అందుకే ఎక్కువ మొత్తంలో కోట్ చేసి మరీ భీమ్లా హక్కులని ఆహా దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. తెలుగులో సక్సెస్ అయిన ఆహా ఓటిట్ ఇప్పుడు తమిళ్ లో కూడా తన హవా స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఆహా నుండి నాగ చైతన్య - సాయి పల్లవి లవ్ స్టోరీ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి హిట్ సినిమాలు స్ట్రీమింగ్ లోకి రాగా.. ఇప్పుడు భీమ్లా నాయక్ డిజిటల్ హక్కులు దక్కించుకుని మరింతగా పాపులర్ కాబోతుంది.