అన్ని బావుంటే అందరూ అనుకున్నట్టుగా జరిగితే జనవరి 7 నే ఆర్.ఆర్.ఆర్ తో సినిమా లవర్స్ పండగ చేసుకునే వారు. కానీ కరోనా ఎంతమందిని డిస్పాయింట్ చేసినా మళ్లీ ఇండస్ట్రీలో ఊపు మొదలైపోయింది. ఫిబ్రవరి 11 నుండి సినిమాలు రిలీజ్ అయినా.. ఫిబ్రవరి 25 న రాబోయే భీమ్లా నాయక్ తో బాక్సాఫీసుకి అసలు జాతర మొదలు కాబోతుంది. మార్చ్ 11న రాధేశ్యామ్ రిలీజ్ తో పాన్ ఇండియా రచ్చ షురూ చెయ్యబోతున్నారు. ఇక మార్చి 25న అసలు సిసలైన సినిమా జాతర ఆర్.ఆర్.ఆర్ టి మొదలవుతుంది. మార్చ్ 25న ఆర్.ఆర్.ఆర్ అని డేట్ ప్రకటించిన నిర్మాతలు.. ప్రస్తుతం ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యకుండా గప్ చుప్ గా ఉన్నారు.
డిసెంబర్ 9 నుండి జనవరి 1 వరకు రాజమౌళి అండ్ రామ్ చరణ్, తారక్ చేసిన ప్రమోషన్స్ ఇంతవరకు ఏ సినిమాకి చెయ్యలేదు. అంతలాంటి ప్రమోషన్స్ తో సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేసారు. అంత ప్రమోషన్స్ చేసాక మళ్లీ ప్రమోషన్స్ చెయ్యాలి అంటే కష్టమే. కానీ రాజమౌళి ఎక్కడా తగ్గరు. మార్చ్ 1 నుండి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ మొదలు పెట్టే యోచనలో టీం ఉన్నట్లుగా ఇన్ సైడ్ టాక్. ప్రతి భాషలో ఓ ప్రెస్ మీట్ పెట్టి సినిమాని ప్రేక్షకుల దగ్గరికి చేరవెయ్యాలని.. సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చెయ్యాలని చూస్తున్నారట. అప్పటినుండి సోషల్ మీడియాలోనూ ఆర్.ఆర్.ఆర్ ట్రెండ్ అయ్యేలా చూడాలనే ప్లాన్ లో టీం ఉందట. అందుకే ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ టీం సైలెన్స్ ని మెయింటింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.