కరోనా సిట్యువేషన్, ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యు నడుస్తున్న టైం లోనే అఖండ తో గర్జించి.. బాక్సాఫీసుని కుదిపేసి.. నిర్మాతలకు లాభాల పంట పండించిన నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఆహా తో ఆన్ స్టాపబుల్ అంటూ అద్భుతం చేసి చూపించి.. నేడు శుక్రవారం గోపీచంద్ మలినేని తో NBK107 సెట్స్ మీదకెళ్ళిపోయారు. రెండు నెలల క్రితమే పూజా కార్యక్రమాలతో మొదలైన NBK107 నేడు రెగ్యులర్ షూటింగ్ షురూ చేసింది. ఈ సినిమా తొలి షెడ్యూల్ తెలంగాణ - సిరిసిల్లలో నేడు అట్టహాసంగా మొదలైంది.
మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం లో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక కేరెక్టర్ కి హీరోయిన్ గా గ్లామర్ భామ శృతి హాసన్ గా ఎంపికయ్యింది. ఇక బాలకృష్ణ మరో కేరెక్టర్ అఖండ మూవీలో సెకండ్ కేరెక్టర్ అంత పవర్ ఫుల్ గా గోపిచంద్ మలినేని డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. వేటపాలెంలో జరిగిన ఒక సంఘటన నేపథ్యంలో ఈ కథ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.