నిర్మాతలు హడావిడి గా డేట్ ఇచ్చినా భీమ్లా నాయక్ కి అన్నీ అలా అలా కలిసొచ్చేస్తున్నాయ్. నిన్నటి వరకు ఏపీలో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది. ఇక పవన్ భీమ్లా నాయక్ కి ఏపీ ప్రభుత్వం చుక్కలు చూపించడం ఖాయం, వకీల్ సాబ్ అప్పుడు అలాగే టికెట్ రేట్స్ తగ్గించి నిర్మాతలని, పవన్ ని ఇబ్బంది పెట్టినట్లుగా, భీమ్లా నాయక్ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం విషం చిమ్ముతుందనే అనుకున్నారు పవన్ ఫాన్స్. అలాగే రెండు రోజుల క్రితం డేట్ ఇచ్చి సైలెంట్ అయ్యారు నిర్మాతలు. అసలు భీమ్లా నాయక్ రిలీజ్ ఈనెల 25 ఉంటుందా అని మీడియాలో వస్తున్న వార్తలతో పవన్ ఫాన్స్ టెంక్షన్ పడ్డారు.
కానీ ఈ రోజు మధ్యాన్నం భీమ్లా నాయక్ నిర్మాత నాగ వంశీ భీమ్లా నాయక్ రిలీజ్ 25 నే కన్ ఫర్మ్ చేస్తూ పవన్ కళ్యాణ్ - రానా లతో పవర్ ఫుల్ పోస్టర్ వదిలాడు. దానితో పవన్ ఫాన్స్ కూల్ అయ్యారు. అలాగే ఏపీ ప్రభుత్వం 50 పర్సెంట్ అక్యుపెన్సీని 100 పర్సెంట్ కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో భీమ్లా మేకర్స్ తో పాటుగా పవన్ ఫాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక పవన్ కళ్యాణ్ షూటింగ్ పూర్తి చెయ్యడము, అటు డబ్బింగ్ పనులు కూడా పూర్తవడంతో యూనిట్ కూడా హ్యాపీ గా ఉంది. ఇకపై భీమ్లా నాయక్ ప్రమోషన్స్ తో ట్రేడ్ ని, ఆడియన్స్ ని ఉర్రుతలూగించాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.