Advertisementt

ఇంట్లో కూడా గంగూభాయ్ వేషాలే

Thu 17th Feb 2022 07:20 PM
ranbir kapoor,alia bhatt,gangubai kathiawadi,sanjay leela bhansali  ఇంట్లో కూడా గంగూభాయ్ వేషాలే
Ranbir Kapoor Complaint About Alia Bhatt ఇంట్లో కూడా గంగూభాయ్ వేషాలే
Advertisement
Ads by CJ

అలియా భట్.. ఇప్పుడు ఆమె పేరు బాలీవుడ్ లోనే కాదు..సౌత్ లోను మోగిపోతుంది. అందం అభినయం ఉన్న అలియా భట్.. ఆర్.ఆర్.ఆర్ తో సౌత్ ప్రేక్షకులకి దగ్గర కాబోతుంటే.. తారక్ తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అక్కడ బాలీవుడ్ లో గంగూభాయ్ కతీయవాడి తో దుమ్ము రేపడానికి రెడీ అయ్యింది. సంజల్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో గంగూభాయ్ గా అలియా భట్ ఫిబ్రవరి 25 న ఇండియన్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్ లో అలియా భట్, సంజయ్ లీలా భన్సాలీ టీం పరుగులు పెడుతుంది. గంగూభాయ్ కతీయవాడి ట్రైలర్ తోనే అలియా భట్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ప్రమోషన్స్ లోను చక్కటి సారీ లుక్ తో అద్భుతంగా ఆకట్టుకుంది. 

అయితే తాజాగా అలియా భట్ గంగూభాయ్ పాత్రలో నటించలేదు.. ఆమె జీవించింది. అలియా భట్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలియా భట్ గంగూభాయ్ పాత్రలో ఎంతగా లీనమైంది అంటే ఇంట్లో కూడా ఆమె గంగూభాయ్ కతీయవాడి మాదిరిగానే నడుచుకునేదట. ఆ విషయం ఆమె బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ నాకు చాలాసార్లు కంప్లైంట్ చేసాడు. అలియా చూడండి.. ఇంట్లో కూడా గంగూభాయ్ లా ప్రవర్తిస్తుంది అని చెప్పాడు. నాకు తెలిసినంతవరకు ఆలియా రియల్ లైఫ్ లోను గంగూభాయ్ పాత్రలోనే ఎక్కువగా ఉండిపోయింది. ఏదైనా పాత్రలో పూర్తిగా లీనమైనప్పుడే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి అంటూ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఓ మీడియా మీట్ లో అలియా గురించి అద్భుతంగా వర్ణించారు.

Ranbir Kapoor Complaint About Alia Bhatt :

Ranbir Kapoor Complain About Alia Bhatt Character In Gangubai Kathiawadi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ