Advertisementt

మంచు బాబుల ఆరోపణలు ఎవరి మీదో

Thu 17th Feb 2022 05:06 PM
mohan babu,manchu vishnu,son of india,mohan babu shocking comments  మంచు బాబుల ఆరోపణలు ఎవరి మీదో
Mohan Babu Shocking comments on Trolls మంచు బాబుల ఆరోపణలు ఎవరి మీదో
Advertisement
Ads by CJ

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు మాట్లాడితే వేరే హీరోలపై ఆరోపణలు చేస్తున్నారు. మా నాన్నకి ఆహ్వానం వచ్చినా అది మా నాన్నగారికి అందనివ్వలేదు అని మంచు విష్ణు అంటే.. నా మీద ఇద్దరు హీరోలు పనిగట్టుకుని 100 మంది స్టాఫ్ ని పెట్టి ట్రోల్ చేయిస్తున్నారు అంటూ సెన్సేషనల్ గా మాట్లాడడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. మంచు విష్ణు, మంచు మోహన్ బాబులు ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో ఎవ్వరికి తెలియంది కాదు.. మా ఎన్నికల్లో ఘన విషయం సాధించాము, ఎదుటి వారిని చిత్తుగా ఓడించాము, అలాంటి మా మీద కక్ష కట్టారు.. అంటూ మాట్లాడుతున్నారు. మోహన్ బాబు నటించిన సన్ అఫ్ ఇండియా ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ట్రోల్స్ అనేవి వస్తుంటాయి. అవి ఆహ్లాదం గా నవ్వించేవిగా ఉండాలి కానీ.. మరొకరిని బాధ పెట్టకూడదు. 

కొన్ని ట్రోల్స్ నాకు తెలిసిన వాళ్ళు నాకు పంపిస్తారు. కొన్నిసార్లు వాటిని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఓ ఇద్దరు హీరోలు 100 మందిని అపాయింట్ చేసుకుని ఇలాంటి ట్రోల్స్ చేయిస్తున్నారు. ఆ హీరోలు ఎవరో కూడా నాకు తెలుసు. ట్రోల్స్ తో తాత్కాలికంగా హ్యాపీగా ఉన్నా.. అది శాశ్వతం కాదు. ఏదొక ఒక టైం లో ఆ హీరోలు కూడా ఇబ్బందులు పడక తప్పదు అంటున్నారు. ఇక సీఎం జగన్ తో మీటింగ్ కి తన తండ్రికి ఆహ్వానం అందకుండా చేసిన వారి పేర్లు తనకి తెలుసు అని, కొద్ది రోజుల్లోనే అవన్నీ బయటపెడతాను అంటున్నాడు విష్ణు బాబు. మరి మంచు బాబులని అంతగా ఏడిపించే ఆ హీరోలెవరో..

Mohan Babu Shocking comments on Trolls:

Mohan Babu Shocking comments on Heroes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ