రెండు డేట్ల సస్పెన్స్ కి తెర దించుతూ భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 నే రిలీజ్ చేస్తున్నామంటూ ఆ సినిమా నిర్మాత నాగ వంశీ ఈ నెల 15 నైట్ ఓ పవర్ ఫుల్ పోస్టర్ తో ప్రకటించిన విషయం తెలిసిందే. దానితో పవన్ కళ్యాణ్ ఫాన్స్ చాలా ఖుషి అయ్యారు. ఏప్రిల్ 1 వరకు వెయిట్ చెయ్యక్కర్లేకుండా తమ అభిమాన హీరో మూవీ థియేటర్స్ లోకి వచ్చేస్తుంది అని హడావిడి మొదలు పెట్టారు. ఇక డేట్ ప్రకటించారో లేదో ఆ నెక్స్ట్ డే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. కానీ భీమ్లా నాయక్ టీం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అటు చూస్తే నాగ వంశీ టీజె టిల్లు సక్సెస్ టూర్ అంటూ తిరుగుతున్నాడు. దానితో పవన్ ఫాన్స్ లో టెంక్షన్ స్టార్ట్ అయ్యింది.
తాజాగా ట్విట్టర్ లో ఓ అభిమాని నాగ వంశీ ని టాగ్ చేస్తూ భీమ్లా నాయక్ విడుదలకు పట్టుమని పది రోజుల టైం కూడా లేదు. కేవలం 8 రోజులు మాత్రమే ఉంది. ట్రేడ్ అండ్ బాక్స్ ఆఫీస్ ట్రాకర్స్ కూడా 25 న భీమ్లా నాయక్ వస్తుందా అని మెసేజ్ చేసి అడుగుతున్నారు. అలాంటి స్టాండర్డ్స్ సెట్ చేసావ్ మూవీ మీద.. భీమ్లా నాయక్ కొత్త పోస్టర్స్ అయినా వదులు అంటూ ట్వీట్ చేసాడు. మరి నిజంగానే డేట్ ఇచ్చేసి కామ్ అయిపోతే అభిమానుల్లో ఆ మాత్రం కంగారు ఉంటుందిగా.
సినిమా ని హిందీ లో రిలీజ్ చేస్తున్నామంటున్నారు. కానీ ప్రమోషన్స్ స్టార్ట్ కాలేదు. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉంటే చాలు సినిమా ఆడేస్తుంది అనుకుంటున్నారేమో నిర్మాత నాగ వంశీ. అసలే కోవిడ్ సిట్యువేషన్ లో ఎంతమంది ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారో చెప్పలేని పరిస్థితి. మరోపక్క అలియా భట్ గంగూభాయ్ కతీయవాడి, అజిత్ వాలిమై పోటీకి ఉన్నాయి. సో నాగ వంశి ఆ ప్రమోషన్స్ విషయమేదో తేల్చేయండి సామి.