మెగాస్టార్ చిరు కి చెల్లెలి కేరెక్టర్ నయనతార చేస్తుంది అనగానే అందరిలో అనుమానాలు. అంత పెద్ద హీరోయిన్ చిరు కి చెల్లెలిగానా? నో నెవ్వర్ ఆమె ఒప్పుకోను గాక ఒప్పుకోదు అన్నారు. కానీ నయనతార మెగాస్టార్ కి చెల్లెలిగా గాడ్ ఫాదర్ లో చెయ్యడానికి ఒప్పేసుకుంది. ఎందుకంటే గాడ్ ఫాదర్ లో సిస్టర్ కేరెక్టర్ కి అంత స్కోప్ ఉంది కాబట్టి. అన్న చెల్లెళ్ళ మధ్యన ఎమోషనల్ బాండింగ్ లేకపోయినా.. ఇద్దరి మధ్యన కోల్డ్ వార్ నడుస్తుంది. మెగాస్టార్ పాత్రకి ఈక్వెల్ గా నయనతార పాత్ర గాడ్ ఫాదర్ లో ఉంటుంది. అయితే గత వారమే గాడ్ ఫాదర్ సెట్స్ లోకి ఎంటర్ అయిన నయనతార కీలకమైన షెడ్యూల్ కోసం హైదరాబాద్ వచ్చింది.
గాడ్ ఫాదర్ సెట్స్ లో దర్శకుడు మోహన్ రాజా తో నయనతార దిగిన పిక్ ని టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. చుడిదార్ లో నయనతార ట్రెడిషనల్ గా కనబడుతున్నా.. ఆమె పాత్ర గాడ్ ఫాదర్ లో చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుంది. నయనతార హస్బెండ్ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లో సత్యదేవ్, చిరు కి బాడీ గార్డ్, అలాగే కీలకమైన పాత్రలో బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ లు నటించడంతో గాడ్ ఫాదర్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక నయనతార హైదరాబాద్ షెడ్యూల్ ని ముగించేసి చెన్నై కి పయనమవుతుంది.