అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అభిమానుల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మరో వారంలో వచ్చేయనున్నాడు భీమ్లా నాయక్. కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాటింగ్ స్టార్ట్ చేయడానికి ముందే రికార్డుల బీటింగ్ మొదలెట్టేసాడు భీమ్లా.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కి ఇమేజ్ కి తగ్గట్టు హ్యూజ్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో ఫిబ్రవరి 25 న రానున్న భీమ్లా నాయక్ డిజిటల్ & శాటిలైట్ రైట్స్ కి కూడా విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో దాదాపు 70 కోట్ల రూపాయలకు డీల్ ఓకే అయిందని వినికిడి. స్టార్ మా ఛానల్ భీమ్లా శాటిలైట్ హక్కులు దక్కించుకోగా డిస్నీ హాట్ స్టార్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కైవసం చేసుకుంది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ రూపం లో ఈ పవర్ ఫుల్ మాస్ మూవీకి 23 కోట్ల వరకూ వచ్చాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకూ కలిపి 90 కోట్ల వరకూ బిజినెస్ జరుగగా కర్ణాటక రైట్స్ 9 కోట్ల 50 లక్షల వరకూ పలికాయట. రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ అంకెలపై మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా ఎరేంజ్ మెంట్స్ చురుగ్గా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 21 సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా వేడుక నిర్వహించేందుకై రంగం సిద్ధమవుతోంది.