అఖండ మూవీ తో మళ్ళీ మాస్ డైరెక్టర్ గా తన పొటన్షియాలిటీ ప్రూవ్ చేసుకున్న బోయపాటి ఇప్పుడు ఇమ్మిడియట్ గా అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాల్సి ఉంది. అయితే పుష్ప పార్ట్ 2 కంప్లీట్ అయ్యేవరకు బన్నీ బిజీ కాబట్టి ఈ లోపు ఓ యంగ్ హీరో తో ఓ సినిమా చేద్దామనే ప్రపోజల్ బోయపాటి కోర్ట్ లో ఉంది. అయితే రామ్ లేదా అఖిల్. అఖిల్ తో సినిమా చెయ్యమని ప్రపోజల్ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నుండి ఉంది.. అలాగే రామ్ తో చెయ్యమని ప్రపోజల్ కూడా ఉంది.
అఖిల్ తో సినిమా చేస్తే.. ఆ బడ్జెట్ బోయపాటి అనుకున్నట్లుగా ఉంటుంది. అదే రామ్ తో చేస్తే బడ్జెట్ ఇంకోలా ఉంటుంది. మరి రామ్ - అఖిల్ లలో ఏ హీరో ని చూస్ చేసుకుని బోయపాటి తన తదుపరి సినిమా ప్రారంభిస్తాడో కానీ.. ప్రెజెంట్ అఖిల్ అయితే సురేందర్ రెడ్డి తో ఏజెంట్ మూవీ చేస్తున్నాడు. మరోపక్క రామ్ కోలీవుడ్ డైరెక్టర్ తో బై లింగువల్ మూవీ ద వారియర్ చేస్తున్నాడు. సో వీరిద్దరిలో ఎవరు ముందు బోయపాటి చాయిస్ అవుతారో చూడాలి.