కాలు నొప్పితో కొన్ని రోజులు, కరోనా వలన మరికొన్ని రోజులు షూటింగ్ కి దూరమైన మహేష్ మొత్తానికి మళ్ళీ కెమెరా ముందుకు ఎంటర్ అయ్యారు. గత వారమే సర్కారు వారి పాట కొత్త షెడ్యూల్ ని పరశురామ్ హైదరాబాద్ లో స్టార్ట్ చేసారు. మహేష్ బాబు లేకుండానే పరశురామ్ కొన్ని సీన్స్ ని చిత్రీకరించారు. ఇక గత వారం మహేష్ బాబు మెగాస్టార్ చిరు బృందం తో కలిసి ఏపీ సీఎం జగన్ ని మీటడంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక అన్ని ముగించుకుని మహేష్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతన్న సర్కారు వారి పాట సెట్స్ లో కాలు పెట్టారు.
అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో యాక్షన్ పార్ట్ చిత్రీకరణ జరుగుతుంది. చాలా స్టైలిష్ గా కంపోస్ చేసిన ఫైట్ లో మైండ్ బ్లాక్ అయ్యేలా కొడుతున్నాడట మహేష్. మే 12న రిలీజ్ కి సర్కారు వారి పాటని ఇకనుంచి శరవేగం గా పూర్తి చేసేలా ఉన్నారు దర్శకుడు పరశురామ్. ఆల్రెడీ కళావతి సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్నట్టు అక్కడ కూడా మహేష్ మైండ్ బ్లాక్ అయ్యే రికార్డులే కొట్టాడు కళావతి సాంగ్ వ్యూస్ లోను, లైక్స్ లోను. ఒక్క సాంగ్ తోనే సినిమాపై విపరీతమైన హిప్ క్రియేట్ చేసారు మేకర్స్. మరి మే 12 లోపు మహేష్ మరెన్ని రికార్డులు బద్దలు కొడతాడో జస్ట్ వెయిట్ అండ్ వాచ్.