ఈ నెల 26న బిగ్ బాస్ తెలుగు ఓటిటి మొదలు కాబోతున్నట్టుగా కన్ ఫర్మ్ చేస్తూ.. హోస్ట్ నాగార్జున ప్రోమోతో దిగిపోయారు. బిగ్ బాస్ ఓటిటి ప్రోమో ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో.. ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మొదలైపోయింది. 70 కెమెరాల మధ్యలో 24 గంటలూ షో చూడొచ్చు.. మరి కేవలం గంట ఫుటేజ్ కోసమే ఇంటి సభ్యులు రెడీ అయ్యి.. గొడవలు పెట్టుకుంటూ, రొమాన్స్ చేస్తూ, కామెడీ పండించేవారు. కానీ ఇప్పుడు 24 గంటలు హౌస్ మేట్స్ కదలికలు ఓటిటి లో లైవ్ లో వచ్చేస్తాయి. అలాంటిది ఈసారి హౌస్ లోకి వెళ్లబోయే వాళ్ళు చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుంది. 24 గంటలు క్రిస్పీ కంటెంట్ రాకపోయినా.. హౌస్ మేట్స్ 24 గంటలు ఏం చేస్తారో.. అనే క్యూరియాసిటీ మొదలైంది ప్రేక్షకుల్లో.
మరి 84 రోజుల పాటు సాగే ఈ ఓటిటి బిగ్ బాస్ హౌస్ లోకి 15 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టబోతున్నారట. ఇప్పటికే సెట్ వర్క్, కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి చేసిందట బిగ్ బాస్ యాజమాన్యం. ఇక పాత సీజన్స్ నుండి ముమైత్‌ఖాన్, అరియానా, తేజస్వి, అఖిల్ సార్ధక్, అషు రెడ్డి, హమిదా, సరయూ, నటరాజ్, మహేశ్ విట్టా లను ఓటిటి కోసం ఎంపిక చేశారట. ఇంకొంతమంది ఫ్రెష్ కేండేట్స్ కూడా ఈ సారి హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారట. మరి వీరంతా అలెర్ట్ గా ప్రేక్షకుడు కోరుకునే కంటెంట్ అందిస్తే.. వాళ్లకి క్రేజ్ వస్తుంది, ఇటు హాట్ స్టార్ కి పనికొస్తుంది. మరి 24 గంటల్లో హాట్ స్టార్ ఓటిటి నుండి ఏదో ఒక టైం లో బిగ్ బాస్ లో ఏం జరుగుతుందో చూసెయ్యడానికి రెడీ అయిపోండి.