Advertisementt

వై ఎస్ జగన్ కి బాలకృష్ణ పంచ్

Tue 15th Feb 2022 02:23 PM
nandamuri balakrishna,tollywood,ap cm jagan,jagan mohan reddy,balakrishna,akhanda movie  వై ఎస్ జగన్ కి బాలకృష్ణ పంచ్
Balakrishna Sensational comments on AP CM Jagan వై ఎస్ జగన్ కి బాలకృష్ణ పంచ్
Advertisement
Ads by CJ

గత వారం మెగాస్టార్ చిరు స్టార్ హీరోలని తీసుకుని ఏపీ సీఎం ని కలిసి సినిమా ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడి.. టికెట్ రేట్స్ ఇష్యు కి శుభం కార్డు పడింది అని చెప్పారు. ప్రభాస్, మహేష్, రాజమౌళి కూడా సీఎం జగన్, మెగాస్టార్ కి కృతఙ్ఞతలు తెలిపారు. అయితే ఈ మీటింగ్ కి సినిమా ఇండస్ట్రీ నుండి ఎవరెవరు చిరు వెంట వెళతారు అనే సస్పెన్స్ నడిచింది. చిరు కూడా బాలకృష్ణ, నాగార్జున, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలకి ఫోన్ చేసి మీటింగ్ కి ఆహ్వానించినట్టుగా కూడా ప్రచారం జరిగింది. కానీ చిరు మాత్రం నాకు మాత్రమే జగన్ ఆహ్వానం ఉంది నా వెంట ఎవరు వస్తారో నాకే తెలియదని మాట్లాడారు. ఇక చిరు ఈ మీటింగ్ పూర్తి చేసి వచ్చాక ఇండస్ట్రీ ప్రముఖులు ఎవరికి తోచిన ట్వీట్స్ వాళ్ళు పెట్టారు. కొంతమంది చిరు కి థాంక్స్ చెబితే.. కొంతమంది వీడియోస్ తో నెగెటివ్ కామెంట్స్ చేసారు.

అయితే తాజాగా బాలకృష్ణ సీఎం జగన్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. సీఎం జగన్ మీటింగ్ కి రమ్మని నన్ను పిలిచారు. నాకు వెళ్లడం ఇష్టం లేక రానని చెప్పాను. అంతేకాదు జగన్ 100 కోట్ల బడ్జెట్ పెడితే ఆ సినిమాకి రాయితీలు ఇస్తామని చెప్పారు. నేను బడ్జెట్ పెంచను. భారీ బడ్జెట్ తో సినిమాలు చెయ్యను, అలాగే జగన్ ని కలవను. సినిమా టికెట్ రేట్స్ తక్కువగా వున్న టైం లోనే అఖండ మూవీ సక్సెస్ అయ్యింది. అదే పెద్ద ఉదాహరణ అంటూ బాలకృష్ణ సీఎం జగన్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. 

Balakrishna Sensational comments on AP CM Jagan:

Nandamuri Balakrishna comments on AP CM Jagan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ