Advertisementt

పవన్ డేట్ ని ఆక్యుపై చేసేసారు

Tue 15th Feb 2022 01:44 PM
varun tej,ghani,pawan kalyan,bheemla nayak,sharwanand,adavallu meekujoharlu,february 25  పవన్ డేట్ ని ఆక్యుపై చేసేసారు
Ghani release date locked పవన్ డేట్ ని ఆక్యుపై చేసేసారు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఈ నెల 25 న వస్తుంది అని పవన్ ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. భీమ్లా నాయక్ మేకర్స్ కూడా జగన్ ఇచ్చే 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ కోసం ఎదురు చూస్తూ ఫాన్స్ ని కన్ఫ్యూషన్ లో పడేస్తున్నారు. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 న భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ అంటూ రెండు డేట్స్ ఇచ్చారు. ఫిబ్రవరి 25 కి మరో పది రోజుల టైం మాత్రమే ఉంది. అటు జగన్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ఎత్తేసినా.. 100 పర్సెంట్ అక్యుపెన్సీ ఇవ్వలేదు. దానితో భీమ్లా నాయక్ రిలీజ్ సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఈలోపు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ డేట్ ని శర్వానంద్ ముందే ఆడవాళ్లు మీకు జోహార్లు తో ఆక్యుపై చేసాడు,.

హడావిడిగా షూటింగ్ ముగించేసి.. ఫిబ్రవరి 25 న శివరాత్రికి వచ్చేస్తున్నాం అంటూ ప్రెస్ మీట్ పెట్టేసాడు. మరోపక్క బాబాయ్ పవన్ డేట్ కి వరుణ్ తేజ్ గని తో దిగిపోతున్నాడు. గని కూడా మార్చి చివరి వారంలో విడుదల చేస్తామని చెప్పి.. పవన్ భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 కి రాదు అని ఫిక్స్ అయ్యి.. గని ని రేస్ లోకి తెచ్చేసారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించిన గని ఫిబ్రవరి 25 రిలీజ్ అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ డేట్ ని కుర్ర హీరోలు శర్వానంద్, వరుణ్ తేజ్ లు ఆక్యుపై చేసారు. 

Ghani release date locked:

Sharwanand Adavallu meekuJoharlu Releasing in Theaters on February 25

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ