Advertisementt

ఫ్లాష్ : ఏపీ సిఎంతో మా ప్రెసిడెంట్

Tue 15th Feb 2022 12:34 PM
manchu vishnu,ap cm,cm jagan,tollywood,maa president  ఫ్లాష్ : ఏపీ సిఎంతో మా ప్రెసిడెంట్
Manchu Vishnu meets CM Jagan ఫ్లాష్ : ఏపీ సిఎంతో మా ప్రెసిడెంట్
Advertisement
Ads by CJ

ఇండియా రాజకీయాలు ఎంత వేడిగా ఉంటున్నాయో.. సినిమా పరిశ్రమలో రాజకీయాలు అంతే హీట్ పుట్టిస్తున్నాయి. గత ఏడాది మా ఎన్నికలను ఓ పొలిటికల్ ఎన్నికల్లా మార్చేసిన విషయం తెలిసిందే. మంచు విష్ణు ప్యానల్, ప్రకాష్ రాజ్ ప్యానల్ మధ్యన ఇద్దరు వ్యక్తులు సీఎం కుర్చీ కోసం పోటీ పడితే ఎలాంటి వాతావరణం ఉంటుందో.. మా అధ్యక్ష పీఠం ఎన్నికలు అలానే జరిగాయి. అయితే మా అధ్యక్షుడు అయ్యాక మంచు విష్ణు మొదటిసారి ఏపీ సీఎం తో భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంతకుముందు మెగాస్టార్ చిరు జగన్ ని కలిసినప్పుడు అది ఆయన వ్యక్తిగత మీటింగ్ అంటూ కామెంట్స్ చేసాడు విష్ణు. తర్వాత మెగాస్టార్ అధ్యక్షతన స్టార్ హీరోలు ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యి సినిమా ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు.

ఆ తర్వాత మంచు విష్ణు హడావిడిగా సీఎం జగన్ అప్పోయింట్మెంట్ తీసుకుని మా అధ్యక్షుడి హోదాలో సీఎం జగన్ ని కలవడానికి అమరావతి వెళ్లినట్టుగా తెలుస్తుంది. గతంలో మంచు విష్ణు భార్య విరోనికాతో కలిసి జగన్ ని కలిశారు. అప్పుడు అది విష్ణు - జగన్ బంధువులుగా కలిశారు. కానీ ఇప్పుడు మంచు విష్ణు మా అధ్యక్ష హోదాలో జగన్ ని మీట్ అవ్వబోతున్నారు. అందుకే ఈ మీటింగ్ కాస్త స్పెషల్ గా మారింది. మరి మంచు విష్ణు, జగన్ తో భేటీ అయ్యి ఏం చర్చిస్తారో.. తన ఉనికిని చాటుకునేలా ఎటువంటి అదనపు లాభాలను పరిశ్రమకు తెస్తారో చూద్దాం.!

Manchu Vishnu meets CM Jagan:

Manchu Vishnu to meet AP CM Jagan Mohan Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ