పాన్ ఇండియా స్టార్ గా మారుతోన్న రామ్ చరణ్ - కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ ల క్రేజీ కాంబినేషన్ తో దిల్ రాజు SVC బేనరుకి 50 వ చిత్రంగా రానున్న RC 15 లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం రాజమండ్రి సమీపంలో జరుగుతోంది. ఆ సినిమా కథ నిమిత్తం 1930 కాలంలో జరిగే కొన్ని కీలక సన్నివేశాలను రామ్ చరణ్ పై తీస్తున్నారట శంకర్. కాగా ఈ షూట్ వెనుక దాగి ఉన్న మరో ఇంట్రెస్టింగ్ థింగ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. మెగా ఫ్యాన్సుకి మాంచి కిక్ ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అదేమిటంటే...
ఈస్ట్ గోదావరి జిల్లా దోసకాయల పల్లిలో 1978 ఫిబ్రవరి 11 వ తేదీన పునాది రాళ్లు చిత్రం కోసం చిరంజీవి పై తొలి సన్నివేశం చిత్రీకరించారట. నాలుగు దశాబ్దాల తరువాత మళ్ళీ అదే ఊళ్ళో అదే నెలలో రామ్ చరణ్ షూటింగ్ జరుగుతూ ఉండడం విశేషంగా చెప్పుకుంటున్నారు అభిమానులు. ఈ విషయం చిరంజీవి దృష్టికీ వెళ్లిందని, ఆయన కూడా సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారనీ సమాచారం.