ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ సమస్యలను తీర్చడానికి సానుకూలంగా ఉంది, టికెట్ రేట్స్ ఇష్యు ఓ కొలిక్కి వచ్చింది, ఇండస్ట్రీ సమస్యల శుభం కార్డు పడింది అంటూ మెగాస్టార్ టాలీవుడ్ కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. నచ్చని వాళ్ళు మెగాస్టార్ ని ఏదో విధంగా విమర్శించినట్టుగానే.. ఈసారి జగన్ తో భేటీ విషయంలో చిరు జగన్ ప్రభుత్వాన్ని యాచించడం నచ్చలేదంటూ విమర్శించారు. ఏది ఏమైనా మెగాస్టార్ ఇండస్ట్రీకి మంచి చెయ్యాలనే ఉద్దేశ్యంతోనే అలా చేశారనే వారు ఉన్నారు. అదలా అంటే ఏపీలో కోవిడ్ కారణంగా నిన్నటి వరకు నైట్ కర్ఫ్యూలు, థియేటర్స్ లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ రూల్స్ పాటిస్తున్నారు. ఈరోజుతో అది ముగిసింది.
అయితే నైట్ కర్ఫ్యూ లు ఎత్తేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. నైట్ కర్ఫ్యూ ఎత్తేసినా, కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని, ఫీవర్ సర్వ్ కొనసాగించాలని చెప్పారు కానీ.. థియేటర్స్ లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఎత్తేసి, 100 పెర్సెంట్ ఆక్యుపెన్సీ ఇస్తున్నట్టుగా చెప్పలేదు. ఇటు చూస్తే భీమ్లా నాయక్ లాంటి సినిమాలు జగన్ ఇచ్చే 100 శాతం ఆక్యుపెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి నైట్ కర్ఫ్యూ ఎత్తేసారు ఓకె.. కానీ ఆక్యుపెన్సీ సంగతేమిటి జగన్ గారు అని అడుగుతున్నారు టాలీవుడ్ నిర్మాతలు.