ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ మార్చ్ 11 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఎప్పుడో జనవరి 14 న రావాల్సిన రాధేశ్యామ్ డేట్ మార్చుకుని మార్చ్ 11 కి ఫిక్స్ అయ్యింది. ఈ రోజు వాలంటైన్స్ డే సందర్భంగా రాధేశ్యామ్ రచ్చ షురూ చేసారు మేకర్స్. రాధే శ్యామ్ నుండి చిన్నపాటి గ్లిమ్ప్స్ వదిలింది టీం. ప్రేరణగా పూజ హెగ్డే చాలా క్యూట్ గా అందంగా కనిపించింది. ఇక గ్లిమ్ప్స్ లోకి వెళితే మళ్లీ లైఫ్ లో వాడి మొహం చూడను అంటుంది పూజ హెగ్డే. విక్రమాదిత్యగా ప్రభాస్ మాత్రం ప్రేరణ చుట్టూ తిరుగుతుంటాడు. పూజ హెగ్డే ని పడెయ్యడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు. పూజ హెగ్డే మాత్రం ప్రభాస్ ని తన చుట్టూ తిప్పుకునే సీన్స్ తో, వారి మధ్యన రొమాంటిక్స్ సీన్స్ తో రాధే శ్యామ్ గ్లిమ్ప్స్ కలర్ ఫుల్ గా ఉన్నాయి.
ఈ గ్లిమ్ప్స్ లో చివరిగా పూజ హెగ్డే ప్రభాస్ తో కుక్ చేస్తావ్, బాగా మాట్లాడతావ్.. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు అనగానే.. ప్రభాస్ ఎక్సప్రెషన్ చూడాలి.. నవ్వొచ్చేలా ఉంది.
నిజమే కదా ప్రభాస్ అంత అందంగా, ఆరడుగులు హైట్ తో, విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో.. కానీ 40 కి చేరువవుతున్నా ఇంకా ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు. సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి పై బోలెడన్ని పుకార్లు నడుస్తున్నా ఈ ఆరడుగుల అందగాడు ప్రభాస్ మాత్రం పెళ్లి ఊసెత్తడు. ఇప్పుడు రాధే శ్యామ్ లో ప్రభాస్ పై పెళ్లి డైలాగ్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.