అనుకున్నదే అయింది. అందరు ఊహించిందే జరిగింది. రిలీజ్ డేట్స్ వ్యవహారంలో వున్న ఏకైక తకరారు తీరిపోయింది. ఆచార్య ఏప్రిల్ 29 న వస్తానంటే F 3 డేట్ మార్చేది లేదు... ఏప్రిల్ 28 నే రిలీజ్ అంటూ కాస్త కవ్వించిన దిల్ రాజు చివరికి హుందాగా వ్యవహరిస్తూ న్యూసెన్స్ కి తెరదించారు. న్యూ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మే 12 న రానున్న సర్కారు వారి పాటకి కూడా దారిచ్చేసి రెండు వారాల గ్యాప్ తర్వాత మే 27 న F 3 వస్తుందంటూ ప్రకటించారు. సో.. ఫిబ్రవరి 25 న నుంచీ మే 27 వరకు నాన్ స్టాప్ గా నాలుగు నెలలు తెలుగు సినిమాల జాతర జరగనుంది.
ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో అంశం... ఈ డేట్స్ మార్పిడి విషయంలో రామ్ చరణ్ ప్రభావం. పంపిణీ రంగంలో తనకున్న పవర్ చూపించడానికై F 3 రిలీజ్ మ్యాటర్ లో దిల్ రాజు పట్టు పట్టడం, ఆచార్యతో పోటీకి సై అనడం రామ్ చరణ్ కి నచ్చలేదు. ఇదేమో తండ్రీ కొడుకులు కలిసి చేసిన సినిమా. అదేమో స్వయానా తన తమ్ముడి సినిమా. ఒక రోజు గ్యాప్ లోనే ఆ రెండు సినిమాలు రావడం కరెక్ట్ అనిపించలేదు రామ్ చరణ్ కి. అందులోను ఆలా పోటీగా వస్తానంటోంది ప్రస్తుతం తాను చేస్తోన్న సినిమా నిర్మాతే కావడం చెర్రీకి చిరాకు తెప్పించింది కూడా.
దాంతో.. శంకర్ మూవీ షెడ్యూల్ డౌట్ లో పడింది. బాటిల్ ఛేంజింగ్ బాల్ దిల్ రాజు కోర్ట్ లో పడింది. స్వతహాగానే చురుకైన దిల్ రాజు లేట్ చెయ్యకుండా డేట్ మార్చుకునే డెసిషన్ తీసేసుకున్నారట. అది వినగానే హ్యాపీ ఫీల్ అయిన రామ్ చరణ్ వెంటనే శంకర్ - దిల్ రాజుల సినిమా షూట్ కోసం ఫ్లైట్ ఎక్కారట. ఇదంతా ఎంతవరకూ నిజమో కానీ నిన్న చెర్రీ షూట్ కోసం కదలడం.. నేడు F 3 న్యూ రిలీజ్ డేట్ రావడం రెండూ బాగానే మ్యాచ్ అవుతున్నాయి.