పెళ్లి సందD సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి సందD సినిమా డిజాస్టర్ అయినా.. శ్రీలీల పేరు మాత్రం ఆ సినిమా తర్వాత మార్మోగిపోయింది. శ్రీలీల లుక్స్, ట్రెడిషనల్ గెటప్, పెళ్లి సందD ప్రమోషన్స్ లో శ్రీలీల సందడి అన్ని టాలీవుడ్ దర్శకనిర్మాతల కన్ను ఆమెపై పడేలా చేసింది. దానితో శ్రీలీల కి అదృష్టం కలిసి వచ్చింది. పెళ్లి సందD తర్వాత రెండు ప్రాజెక్ట్స్ కి ఓకే అయ్యింది. పారితోషకం పెంచేసింది. రవి తేజ తో ఓ సినిమా, నవీన్ పోలిశెట్టి తో మరో సినిమాకి కమిట్ అయ్యింది.
ఇక తాజాగా రవి తేజ - త్రినాధ్ రావు నక్కిన కాంబోలో తెరకెక్కుతున్న ఢమాకలో శ్రీ లీల రవితేజ తో రొమాన్స్ చేస్తుంది. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ఢమాకా నుండి శ్రీ లీల - రవితేజ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది టీం. ఈ పిక్ లో పావని పాత్రలో మోడరన్ గెటప్ లో శ్రీలీల, రవి తేజ పక్కన కనబడుతుంది. మరి పెళ్లి సందD శ్రీలీల ఢమాకా లుక్ తోనే ఇంప్రెస్స్ చేసేలా ఉంది. ఇవి కాకుండా శ్రీలీల యంగ్ టైగర్ సినిమా లోను, బాలకృష్ణ - అనిల్ రావిపూడి సినిమాలో బాలకృష్ణ కి కూతురిగాను నటించబోతున్నట్లుగా తెలుస్తుంది.