హరి హర వీరమల్లు నెక్స్ట్ షెడ్యూల్ అప్ డేట్
Hari Hara Veera Mallu Movie Updateపవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. అన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ లో ఫుల్ ఆక్యుపెన్సీ ఇచ్చేసినా, నైట్ కర్ఫ్యూలు ఎత్తేసినా ఏపీలో జగన్ ప్రభుత్వం మాత్రం ఇంకా నైట్ కర్ఫ్యూ, 50 పర్సెంట్ అక్యుపెన్సీలని కొనసాగించడంతో.. భీమ్లా నాయక్ డేట్ సస్పెన్స్ లో పడింది. ఇక అదలా ఉంటే పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం హరి హర వీరమల్లు షూటింగ్ కి రెడీ అవుతున్నారు. దర్శకుడు క్రిష్ హరి హర వీరమల్లు రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసి కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ కోసం చూస్తున్నారు.
ఈ గ్యాప్ లో క్రిష్ హరిహర వీరమల్లు కోసం కావల్సిన సెట్స్ ని సిద్ధం చేసారు. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ చేస్తే.. మేజర్ పార్ట్ కంప్లీట్ అయ్యేవరకు షూటింగ్ ఆగకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. పవన్ కూడా క్రిష్ మూవీ కోసం ఓ 50 రోజుల పాటు అందుబాటులో ఉండబోతున్నారట. హరి హర వీరమల్లు తదుపరి షెడ్యూల్ మార్చ్ 18 నుండి మొదలు పెట్టనున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ - నిధి అగర్వాల్ జంటగా, అర్జున్ రామ్ పాల్ విలన్ గా, బాలీవుడ్ భామ నోరా ఫతేహి కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు తదుపరి షెడ్యూల్ కోసం క్రిష్ ఏర్పాట్లలో మునిగిపోయినట్లుగా తెలుస్తుంది.
Hari Hara Veera Mallu Movie major Update






































