కొన్నాళ్లుగా అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ ఆక్టివ్ గా లేని మంచు మోహన్ బాబు.. గత ఏడాది కోలీవుడ్ హీరో సూర్య ఆకాశం నీ హద్దు రా మూవీలో ఓ చిన్న కేరెక్టర్ వెయ్యడమే కాకుండా.. సన్ అఫ్ ఇండియా తో మరోసారి హీరో గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. చిరు తో సన్ అఫ్ ఇండియా టీజర్ లాంచ్ చేయించి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ నెల 18 న మోహన్ బాబు సన్ అఫ్ ఇండియా మూవీ రిలీజ్ కాబోతుంది. అందులో భాగంగా ఇంటర్వూస్ లో పాల్గొంటున్న మోహన్ బాబు సంచలనం నిర్ణయం తీసుకున్నారు. అది తాను ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనబోను అని, తనకి రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదు అని, నటనతో, అలాగే విద్యా సంస్థల పనులతో బిజీగా వుంటున్నట్లుగా చెప్పారు. అయితే ఇప్పుడు మంచు ఫ్యామిలీకి మంత్రి పేర్ని నాని కష్టాలు మొదలయ్యాయి.
అది ఏపీ ప్రభుత్వంతో సమావేశానికి హాజరవని మోహన్ బాబు ఇంటికి వెళ్లి మంత్రి నాని చిరు బృందంతో జగన్ మీటింగ్ విషయాలు మాట్లాడినట్లుగా, సినీ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం చేసిన మేలు కి మంచు విష్ణు జగన్ కి కృతఙ్ఞతలు చెబుతూ ఓ ట్వీట్ చెయ్యడం, దానిని డిలేట్ చెయ్యడం, ఆ తర్వాత పేర్ని నాని కి ఆతిథ్యం ఇచ్చినందుకు హ్యాపీ అంటూ మరో ట్వీట్ చెయ్యడం, తర్వాత పేర్ని నాని మోహన్ బాబు నాకు స్నేహితుడు అందుకే వాళ్ళింటికి వెళ్ళాను, అంతేకాని మీటింగ్ విషయాలు మాట్లాడడానికి కాదు అంటూ మంచు ఫ్యామిలీ గాలి తీసెయ్యడం అంతా తెలిసిందే.
తాజాగా మోహన్ బాబు ఈ విషయమై మరోసారి వివరణ ఇచ్చారు. మంత్రి పేర్ని నాని తనకి స్నేహితుడు అని, స్నేహితులు ఇంటికి రాకూడదా అంటూనే పేర్ని నాని తో ఏపీ సీఎం జగన్ - చిరు బృందం సమావేశానికి సంబందించిన మాటలు మాట్లాడుకోలేదు అని, మా సినిమా వాళ్ళు వచ్చి ప్రభుత్వంతో ఏం మాట్లాడారు అని మంత్రి గారిని ఎలా అడుగుతాం. ఇంటికి పిలిచి అతిధి గౌరవం ఇచ్చాం.. ఆయన ప్రభుత్వ ప్రతినిధిగా రాలేదు, ఓ ఫ్రెండ్ గా మాత్రమే వచ్చాడు. నాని కి శుభాకాంక్షలు చెబుతూ విష్ణు చేసిన ట్వీట్ ని తప్పుబట్టారు అంటూ మోహన్ బాబు మీడియాకి వివరణ ఇవ్వడం చూసిన నెటిజెన్స్ పాపం మోహన్ బాబుకి విష్ణు బాబు తెచ్చిన కష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.