Advertisementt

పవన్ ఫ్యాన్సులో పూనకం పుట్టించాడు

Sun 13th Feb 2022 12:18 PM
bheemla nayak latest still,pawan kalyan latest still from bheemla nayak,pawan kalyan new pic from bheemla nayak,bheem bheem song from bheemla nayak  పవన్ ఫ్యాన్సులో పూనకం పుట్టించాడు
Pawan Kalyan Latest Pic From Bheemla Nayak Movie పవన్ ఫ్యాన్సులో పూనకం పుట్టించాడు
Advertisement
Ads by CJ

భీమ్లా నాయక్ రోల్ లో వెండితెరపై పవన్ పవర్ చూడాలని ఆరాటంగా ఉన్నారు అభిమానులు. అయితే జనవరిలోనే వచ్చేస్తానని ప్రకటించిన భీమ్లా నాయక్ ఇప్పటికీ అయితే ఫిబ్రవరి 25 లేకుంటే ఏప్రిల్ 1 అంటూ ఊరిస్తూనే ఉన్నాడు. తాజాగా ఆంధ్రాలో టికెట్ రేట్ల సవరణపై ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది కనుక కొత్త జీవోని ఎపుడు వెలువరిస్తారో, ఎప్పట్నుంచీ అమల్లోకి అంటారో అని యావత్ తెలుగు సినీ రంగంతో పాటు భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నిన్నటి నుంచి జరుగుతున్న ప్యాచ్ వర్క్ షూటింగ్ తో భీమ్లా టోటల్ షూట్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. సెన్సార్ కి కూడా ఆల్ రెడీ అప్లయ్ చేసేసారు. మొత్తానికి అన్నీ సిద్ధం చేసుకు పెట్టుకుని అనువైన సిట్యుయేషన్ చూసి భీమ్లాని బాక్సాఫీస్ బరిలోకి దింపెయ్యాలనేది నాగ వంశీ ప్లాన్.

రీసెంట్ గా పక్క రాష్ట్రమైన తమిళనాడులో కోవిడ్ ఆంక్షలను సవరిస్తూ సినిమా థియేటర్సుకి హండ్రెడ్ పర్శంట్ ఆక్యుపెన్సీ ఇచ్చేసారు. ఇక ఆంధ్రాలోనూ ఈ వారంలోనే ఆ నిర్ణయం తీసుకోక తప్పదని అంటున్నారు. సో.. భీమ్లా నాయక్ కే కాదు అన్ని భారీ తెలుగు సినిమాలు బయటపడ్డానికి దారులు తెరుచుకున్నట్టే.!

ఈ నేపథ్యంలో మాంచి ఉత్సాహంగా ఉన్న భీమ్లా నిర్మాత నాగ వంశీ పవన్ లేటెస్ట్ స్టిల్ ని అభిమానులతో పంచుకుంటూ భీమ్ భీమ్ భీమ్ సాంగ్ లోడింగ్ అంటూ ట్వీట్ చేసారు. అంతేకాదు రిలీజ్ డేట్ కూడా అతి త్వరలో ప్రకటిస్తాం అంటూ ఫాన్స్ లో జోష్ నింపారు. కాగా నాగవంశీ షేర్ చేసిన పిక్ భీమ్లా నాయక్ టైటిల్ సాంగులోని ఆ జుట్టునట్టా సవరించినాడో.. సింగాలు జూలు విదిలించినట్టే.. అనే లైన్స్ కి యాప్ట్ గా ఉందంటూ సోషల్ మీడియాలో సెలెబ్రేషన్స్ షురూ చేసేసారు పూనకం వచ్చినట్టు ఊగిపోతోన్న పవర్ స్టార్ ఫాన్స్..!

Pawan Kalyan Latest Pic From Bheemla Nayak Movie:

Bheem Bheem Bheem Bheeem Song From Bheemla Nayak

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ