Advertisementt

డీజె టిల్లు.. తొలి రోజు కాసుల జల్లు

Sun 13th Feb 2022 11:11 AM
dj tillu movie first day share,dj tillu movie first day collections,dj tillu movie revenue,dj tillu movie telugu review,dj tillu movie english review,dj tillu hero siddu jonnalagadda  డీజె టిల్లు.. తొలి రోజు కాసుల జల్లు
DJ Tillu First Day Collections డీజె టిల్లు.. తొలి రోజు కాసుల జల్లు
Advertisement
Ads by CJ

అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన డీజె టిల్లు చిత్రానికి టార్గెటెడ్ ఆడియన్స్ నుంచి టెర్రిఫిక్ రిసెప్షన్ లభించింది. టైటిల్ సాంగుతో పాటు టీజర్, ట్రైలర్ వంటివి కూడా కుర్రకారుని ఎట్రాక్ట్ చేయడంతో తొలిరోజున డీజె టిల్లు థియేటర్సులో కాసుల జల్లు కురిసింది. గమ్మత్తైన డైలాగ్ డెలివరీతో, యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టరైజేషన్ తో డీజె టిల్లుగా అలరించిన సిద్దు జొన్నలగడ్డ రైటర్ గాను ఫన్నీ వన్ లైనర్స్ తో ఆకట్టుకున్నాడు. దాంతో అటు సిద్ధుకి - ఇటు సితార బేనర్ కి డీజె టిల్లు రూపంలో మరో హిట్టు వచ్చి వరించింది. ఇక డీజె టిల్లు ఫస్ట్ డే కలెక్షన్ ఎంతంటే....

నైజాం : 1.56 Cr

సీడెడ్ : 43 లక్షలు

నెల్లూరు : 10 లక్షలు

కృష్ణా : 11 లక్షలు

గుంటూరు : 15 లక్షలు

ఈస్ట్ : 18 లక్షలు

వెస్ట్ : 32 లక్షలు

ఉత్తరాంధ్ర : 25 లక్షలు

టోటల్ : 3.10 Cr షేర్ (గ్రాస్ 5.90 Cr)

ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తొలి రోజే మూడు కోట్లకి పైగా షేర్ కొల్లగొట్టిన డీజె టిల్లు ఓవర్సీస్ లో అల్ రెడీ 250 k వరకూ గ్రాస్ రెవిన్యూ రాబట్టేసాడు. దాంతో అక్కడ తొలిరోజునే బ్రేక్ ఈవెన్ అయిపోయి దర్జాగా ప్రాఫిట్ జోన్లోకి ప్రవేశించాడు.

మొత్తానికి యువతరాన్ని ఆకర్షిస్తే అట్లుంటది మరి అని మరోమారు ప్రూవ్ చేస్తూ తిరుగులేని హిట్టు కొట్టిన టిల్లుగాని డీజె ఇంకొన్ని రోజులు గట్టిగా మోగుతూనే ఉంటుంది. ఆడియన్సుని థియేటర్సుకి లాగుతూనే ఉంటుంది.! 

DJ Tillu First Day Collections:

Extrordinary Openings For DJ Tillu Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ