Advertisementt

తమిళనాడు హ్యాపీ మరి ఆంధ్రా

Sun 13th Feb 2022 10:54 AM
tamil nadu,ap,100 percent occupancy,theatres kollywood,tollywood  తమిళనాడు హ్యాపీ మరి ఆంధ్రా
Tamil Nadu Happy, But Andhra తమిళనాడు హ్యాపీ మరి ఆంధ్రా
Advertisement
Ads by CJ

కరోనా థర్డ్ వేవ్ ఎక్కడ ముంచుకు వస్తుందో అని పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్స్ పెట్టాయి. జనవరి మొదటి వారంలోనే చాలా రాష్ట్రాలు హడావిడి పడ్డాయి. కానీ కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం తీవ్రంగా లేకపోవడంతో మళ్ళీ అంతా సాధారణ స్థితికి రావడం మొదలయ్యింది. దానితో ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అవడం, విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్ లాంటివి ఓపెన్ చేసారు. ఇక తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూలు ఎత్తెయ్యడమే కాదు.. ప్రస్తుతం థియేటర్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ ని 100 శాతానికి పెంచేసింది. ఈ నెల 16 నుండి 100 పర్సెంట్ సీటింగ్ తో థియేటర్స్ నడవబోతున్నాయి. దానితో తమిళ పరిశ్రమ హ్యాపీగా ఉంది. లేదంటే వాలిమై లాంటి సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వాటికీ ఇబ్బంది అయ్యేది.

ఇక తమిళనాట హ్యాపీ.. కానీ ఇంకా ఆంధ్రలోనే ఏ విషయము తేలడం లేదు. జగన్ ప్రభుత్వం టికెట్ రేట్స్ ఇష్యుని ఆల్మోస్ట్ ఓ కొలిక్కి తెచ్చింది. అలాగే నైట్ కర్ఫ్యూలు ఎత్తేసి.. థియేటర్స్ లో 100 పెర్సెంట్ ఆక్యుపెన్సీ ఇస్తే.. టాలీవుడ్ కూడా కుదట పడుతుంది. రేపటివరకు ఆంధ్రాలో నైట్ కర్ఫ్యూలు ఉన్నాయి. ఇక మీదట ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో అని మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. నైట్ కర్ఫ్యూ ఎత్తేసి.. 100 శాతం సీటింగ్ సామర్థ్యం ఇస్తే.. పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కి క్యూ కడతాయి. మరి ఏపీ సీఎం జగన్ గారి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. 

Tamil Nadu Happy, But Andhra:

Tamil Nadu allows 100 percent occupancy in theatres

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ