మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా పరశురామ్ తెరకెక్కిస్తున్న క్రేజీ మూవీ సర్కారు వారి పాటకు ఇప్పుడు కష్టాలు వెంటాడుతున్నాయి. నిన్నటివరకు సర్కారు వారి పాట పై పెంచిన అంచనాలను లీకుల రాయుళ్లు ఒక్క గంటలో తుస్ మనిపించారు. గత నాలుగు రోజులుగా సర్కారు వారి పాటు ఫస్ట్ సింగిల్ కళావతి సాంగ్ అప్ డేట్స్ తో కళకళలాడించారు. మహేష్ అందం, ఆయన స్టైలిష్ లుక్స్, కీర్తి సురేష్ గ్లామర్ లుక్స్, సాంగ్ లిరిక్స్, మ్యూజిక్ అన్నింటిపై టీం పోస్టర్స్, ప్రోమో తో విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చింది. రేపు వాలంటైన్స్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లీకుల రాయుళ్లు సర్కారు వారి పాట ఫుల్ సాంగ్ ని నెట్టింట్లో లీక్ చేసి వైరల్ చేసారు.
దానితో టీం తో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఖంగు తినడమే కాదు.. థమన్ అయితే మనసంతా చాలా బాధగా ఉంది ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. ఆరు నెలలుగా ఈ సాంగ్ కోసం టీం అంతా చాలా కష్టపడ్డాం. ఈ సాంగ్ షూట్ చేసినప్పుడు ఎనిమిదిమంది కరోనా బారిన పడ్డారు. అయినా సాంగ్ బాగా రావాలని కష్టపడ్డాం. మరో రోజులో ఈ సాంగ్ మీకు అందిద్దామనుకున్నాం. కానీ ఒకడు ఈ పాటని చాలా ఈజీగా లీక్ చేసేసాడు. వాడికి పని అప్పజెబితే దానిని ఇలా లీక్ చేసి మమ్మల్ని చాలా బాధపెట్టాడని, ఈ పాట కోసం 1000 మంది పని చేశామంటూ వాపోయాడు. అదలా ఉంటే రేపు రావాల్సిన ఈ సాంగ్ ని ఈ రోజే రిలీజ్ చేస్తున్నట్లుగా.. కొద్ది గంటల్లో అప్ డేట్ ఇస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. అంటే సర్కారు వారి పాట ఫస్ట్ లిరికల్ ఈ రోజే రిలీజ్ కాబోతుంది.