ఫిబ్రవరి 10 న టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్ అధ్యక్షతన ఏపీ సీఎం జగన్ తో సమావేశమై టికెట్ రేట్స్ ఇష్యు, ఐదో ఆటకి అనుమతి, అలాగే కొద్ది రోజుల్లో ఇండస్ట్రీ మస్యలు తీరిపోతాయని హామీలు తీసుకువచ్చారు. చిరంజీవి అధ్యక్షతన ప్రముఖులు జగన్ తో భేటీ అయ్యారు. మహేష్ దగ్గర నుండి ప్రభాస్ వరకు అందరూ చిరు కి జగన్ కి థాంక్స్ చెప్పారు. అయితే బాహుబలిలాంటి భారీ మూవీలు తీసిన వారు, మెగాస్టార్ చిరు లాంటి పెద్ద వారు ఇలా సీఎం జగన్ ని బెగ్గింగ్ చెయ్యడం తనకి నచ్చలేదు అంటూ రామ్ గోపాల్ వర్మ నిన్న శుక్రవారం ట్వీట్ చేసారు. మెగా బాహుబలులు ఇలా జగన్ ని బెగ్గింగ్ చెయ్యడం ఏమిటి అంటూ ట్వీట్ చేసారు.
ఇక నేడు శనివారం దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ వీడియో రిలీజ్ చేసారు. గత కొన్నాళ్ళుగా ఏపీ ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్యన గ్యాప్ వచ్చింది అని, ఏదో ఇబ్బంది ఉంది అంటూ వార్తలొస్తున్నాయి. అలాంటిదేం లేదని అప్పుడు చిరు గారు చెప్పినప్పుడు హ్యాపీ గా ఫీల్ అయ్యాం. చిరంజీవి గారిని మేము ఇండస్ట్రీ పెద్ద అనుకుంటాం.. కానీ ఆయన ఒప్పుకోరు. నేను ఇండస్ట్రీ బిడ్డని అంటారు. అయినా ఇండస్ట్రీ పెద్దయినా, బిడ్డయినా ఎవరికైనా ఓ ఆత్మగౌరవం ఉంటుంది. ఇండస్ట్రీ తరపున వెళ్ళినప్పుడు చిరంజీవి గారే పెద్ద. అక్కడ చిరు మీడియా తో మాట్లాడిన వీడియో చూస్తే ఆయన తన ఆత్మ గౌరవం పక్కనపెట్టి జగన్ ని యాచించినట్లుగా అనిపించింది.
అది చూసిన నాకు మనం ఇలాంటి స్టేజ్ లో ఉన్నామా అనే బాధ కలిగింది. ఇండస్ట్రీ లో సమస్య అనేది ఒక్క టికెట్ రేట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి. ఏదో టికెట్ రేట్స్ పెంచారు, ఐదో ఆటకి అనుమతులు ఇచ్చారు. సీఎం జగన్ వైజాగ్ లో స్థలాలు ఇస్తామన్నారు. అవన్నీ ఒప్పేసుకున్నారు. జగన్ చెప్పినట్టుగా వైజాగ్ లో సినిమా ఇండస్ట్రీని డెవెలెప్ చెయ్యాలి. కేవలం 20 నుండి 25 కోట్ల వసూళ్ల కోసం పెద్దలైన చిరు, ప్రభాస్, రాజమౌళి, మహేష్ లాంటి వాళ్ళు అలా జగన్ ని అడుక్కోవడం చాలా బాధగా ఉంది. అంతగా రిక్వెస్ట్ చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. మనం టాక్స్ పే చేస్తున్నాం.. మనం ఎందుకు అలా ఉండాలి అంటూ తమ్మారెడ్డి ఆ వీడియో లో సంచలనంగా మాట్లాడారు.