సూపర్ స్టార్ మహేష్ కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ చెప్పక్కర్లేదు. మహేష్ బాబు టాలీవుడ్ కే నెంబర్ వన్ అనేంత కెపాసిటీ ఉన్న హీరో. అయితే సౌత్ లో మహేష్ కి ఉన్న క్రేజ్ నార్త్ లో లేదనే చెప్పాలి. రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఆఖరికి కళ్యాణ్ రామ్ కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నా మహేష్ మాత్రం ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా మూవీ చెయ్యలేదు. రాజమౌళి తో కలిసి పని చెయ్యబోయే మూవీ లోనే మహేష్ బాబు పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టేలా కనిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాల హవా హిందీ మర్కెట్ పై బలంగా కనబడుతుంది. సౌత్ లో ప్లాప్ అయిన సినిమాలు కూడా నార్త్ లో ఇరగదీస్తూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి. అందుకే తెలుగు సినిమాలు అన్నీ ఇప్పుడు హిందీ రీలీజ్ కి రెడీ అవ్వడమే కాదు.. తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులకు ఫుల్ డిమాండ్ నడుస్తుంది.
చిరు ఆచార్య, పవన్ భీమ్లా నాయక్ హిందీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వాటి హిందీ డబ్బింగ్ రైట్స్ క్రేజీ డీల్ తో అక్కడ మేకర్స్ సొంతం చేసుకున్నారు. అలాగే మహేష్ - పరశురామ్ సర్కారు వారి పాట హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముడుపోయినట్లుగా తెలుస్తుంది. అది కూడా 15 కోట్ల తో డీల్ ముగిసినట్లుగా టాక్. మరి మహేష్ మూవీ కి హిందీలో మరీ తక్కువ మార్కెట్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు ఏకంగా 28 కోట్లకి అమ్ముడుపోగా.. చిరంజీవి ఆచార్య 26 కోట్లకి హిందీ హక్కులు అమ్మేసారు. తర్వాత పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ 23 కోట్లకి హిందీ డబ్బింగ్ రైట్స్ ని మేకర్స్ అమ్మగా, రామ్ చరణ్ అట్టర్ ప్లాప్ సినిమా వినయవిధేయరామ కూడా అప్పట్లో 22 కోట్లకి అమ్ముడుపోయింది.
అయితే ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి మరీ తక్కువలో 15 కోట్లు అంటే అది చాలా తక్కువ అమౌంట్ అనే చెప్పాలి. అంటే మహేష్ సినిమాలు హిందీలో ఆడవనా ఇంత తక్కువ కోట్ చేసారు అనేది మహేష్ ఫాన్స్ మదిలో మెదులుతున్న ప్రశ్న.