స్టార్ మా లో ఆదివారం సాయంత్రం BB జోడి అంటూ వాలెంటైన్స్ డే స్పెషల్ ప్రోగ్రాం ప్రసారం కాబోతుంది. ప్రస్తుతం BB జోడి ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. BB జోడి అంటే అందరూ జోడిగానే వస్తారు. బిగ్ బాస్ పార్టిసిపేట్స్ అలాగే సీరియల్ ఆర్టిస్ట్ లు ఈ BB జోడి లో డాన్స్ పెరఫార్మెన్స్ తో అదరగొట్టేసారు. యాంకర్ గా రవి, దీపికా పిల్లి లు కనిపిస్తుండగా.. వరుణ్ సందేశ్ - వితిక జోడి, భాను - రోల్ రైడా జోడి, జెస్సి - ప్రియాంక జోడి, మానస్ - లహరి జోడి, ఇంకా రవి - ఆశు రెడ్డి, నోయెల్ - హారిక, సోహెల్ - అరియనా ఇలా చాలామంది జోడి డాన్స్ పెరఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక అవినాష్ - రోహిణిలు స్పెషల్ స్కిట్స్ తో అదరగొట్టేసారు.
అయితే అందరూ జంటగా డాన్స్ పెరఫార్మెన్స్ చేస్తే.. బిగ్ బాస్ షణ్ముఖ్ మాత్రం సింగిల్ గా పెరఫార్మెన్స్ చేసాడు. అంటే దీప్తి సునయన బ్రేకప్ చెప్పాక.. ఎవరిని తన పక్కన ఊహించుకోలేక జోడిగా ఎవరిని తీసుకోలేదో.. లేదంటే సిరి తో కలిసి పెరఫార్మెన్స్ చేస్తే.. అందరూ అనుకునే మాటలను నిజం చేసినట్టు అవుతుంది అనో కానీ.. షణ్ముఖ్ అయితే ఎలాంటి జోడి లేకుండానే సింగిల్ గా డాన్స్ పెరఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సూపర్ గా డాన్స్ చేసి ఆహా అనిపించాడు. అయితే అతనికి జోడిగా ఎవరైనా ఉంటే బావుండు పాపం షణ్ముఖ్ అనేలా ఉంది అతని పరిస్థితి. అయితే ఈ ఈవెంట్ లో సిరి హన్మంత్ ఎక్కడా కనిపించకపోవడం విశేషం.