జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన క్రేజీ పాన్ ఇండియా ఫిలిం ఆర్.ఆర్.ఆర్ మార్చ్ 25 న రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. మధ్యలో మార్చి 18, ఏప్రిల్ 28 అని రెండు డేట్స్ లాక్ చేసినా.. మార్చి 18 నుండి 25 కి ఫిక్స్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కి భీమ్లా నాయక్ గండం మరోసారి వెంటాడేలా కనబడుతుంది. ఎందుకంటే భీమ్లా నాయక్ కూడా ఈ నెల 25 కానీ లేదంటే ఏప్రిల్ 1 న విడుదలకు డేట్ లాక్ చేసారు నిర్మాతలు. ఇప్పుడు చూస్తే ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఎత్తేస్తేనే ఈ నెల 25 కి భీమ్లా వస్తుంది అని మేకర్స్ పదే పదే చెబుతున్నారు.
ఇప్పడు అది సాధ్యమయ్యేలా లేదు. భీమ్లా నాయక్ వెనక్కి తగ్గేలా కనిపించడంతో శర్వానంద్, వరుణ్ తేజ్ ఫిబ్రవరి 25 మీద కచ్చిఫ్ వేసేసారు. వరుణ్ గని, శర్వా ఆడవాళ్లు మీకు జోహార్లు రెండు ఈ 25 న రాబోతున్నాయి. ఇక దీన్ని బట్టి భీమ్లా నాయక్ ఏప్రిల్ 1 కి షిఫ్ట్ అయినట్లే. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయిన వారానికే భీమ్లా రిలీజ్ ఉంటుంది. అప్పుడు ప్రాబ్లెమ్. ఆర్.ఆర్.ఆర్ కి కనీసం రెండు వారాలు కావాల్సిందే. లేదంటే ప్రాబ్లెమ్ అవుతుంది. భీమ్లా నాయక్ క్రేజ్ ముందు అది కష్టం. జనవరిలోనే ఆర్.ఆర్.ఆర్ మూవీకి భీమ్లా నాయక్ కష్టం వచ్చినా ఏదో దిల్ రాజు మ్యానేజ్ చేసి భీమ్లా నాయక్ ని ఆర్.ఆర్.ఆర్ కి అడ్డు లేకుండా చేసారు. కానీ ఇప్పుడు భీమ్లా నాయక్ ఏప్రిల్ 1 కి అంటే ఆర్.ఆర్.ఆర్ మళ్లీ ఇబ్బందే.
మరోపక్క భీమ్లా నాయక్ హిందీ రిలీజ్ ని కూడా కన్ ఫర్మ్ చేసారు నిర్మాతలు. అక్కడ హిందీ బాక్సాఫీసు దగ్గరా భీమ్లా నాయక్ ఆర్.ఆర్.ఆర్ కి అడ్డు తగలబోతోంది.