Advertisementt

ఎన్టీఆర్ సినిమా అందుకే లేట్

Fri 11th Feb 2022 09:59 PM
koratala siva,young tiger ntr,alia bhatt,ntr 30 launch  ఎన్టీఆర్ సినిమా అందుకే లేట్
NTR30 Launch Postponed ఎన్టీఆర్ సినిమా అందుకే లేట్
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ - కొరటాల కాంబో మూవీ ఈపాటికి పూజా కార్యక్రమాలతో మొదలైపోవాల్సింది. ఫిబ్రవరి 7 నే NTR30 కి ముహూర్తం అన్నారు. కానీ అది జరగలేదు. అయితే ఆ సినిమా మొదలు కాకపోవడానికి కారణం హీరోయిన్ అలియా భట్ అంట. ఎన్టీఆర్ - కొరటాల కాంబో మూవీ కి క్యూట్ భామ అలియా భట్ నే హీరోయిన్ గా ఎంపిక చేసినట్టుగా అలియా భట్ బయటపెట్టేసింది. తాను ఎన్టీఆర్ తో కలిసి మళ్ళీ వర్క్ చేయబోతున్నాను అని.. అది ఇంత త్వరగా అంటూ సర్ ప్రైజ్ చేసింది. 

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలు పోస్ట్ పోన్ అవడానికి కారణం అలియా భట్ అంట. అంటే అలియా భట్ నటించిన గంగూభాయ్ కతీయవాడి ప్రమోషన్స్ లో బిజీ షెడ్యూల్ వేసుకున్న అలియా భట్ రెండు వారాల వరకు NTR30 పూజా కార్యక్రమాలకు అందుబాటులోకి రాలేదట. అందుకే కొరటాల అలియా కోసమే ఈ పూజ ని వాయిదా వేసారట. అంటే అలియా భట్ పూజ కార్యక్రమాలకు హాజరైతే.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి నేషనల్ వైడ్ గా క్రేజ్ వస్తుంది. అలాగే నేషనల్ మీడియా కవరేజ్ ఉంటే సినిమాకి స్టార్టింగ్ నుండే హైప్ క్రియేట్ అవుతుంది .అందుకే అలియా భట్ కోసం సినిమా పూజ ని కూడా ఆపుకున్నారట.

NTR30 Launch Postponed:

Koratala Siva NTR 30 launch postponed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ