Advertisementt

ఆహా ఆరంభం

Fri 11th Feb 2022 08:48 PM
aha,aha ott,aha videos,aha tamil ott app launch  ఆహా ఆరంభం
Aha Arambham launch ఆహా ఆరంభం
Advertisement
Ads by CJ

తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ మీద నెంబర్ వన్ అనిపించుకున్న ఆహా ఓటిటి రీసెంట్ గా బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో తో హ్యుజ్ సబ్ స్క్రైబర్స్ ని పెంచుకుంది. తెలుగులో సక్సెస్ ఫుల్ గా రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఆహా యాజమాన్యం సరికొత్త ఉత్సాహంతో తమిళ్ కూడా ఆహా ఆరంభం పేరుతొ ఆహా యాప్ ని గ్రాండ్ గా లాంచ్ చేసారు. కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అండ్ హీరో జయం రవి చేతుల మీద గా ఈ యాప్ తమిళ్ లో లాంచ్ అయ్యింది. ఆర్బీ చౌదరి, కె.ఎస్ రవికుమార్ లాంటి సెలబ్రిటీస్ ఈ లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. 

నిన్న గురువారం అల్లు అరవింద్ చెన్నై వెళ్ళింది ఈ ఆహా ఆరంభం యాప్ లాంచ్ కోసమేనట. ఇక్కడ టికెట్ రేట్స్ విషయంలో ఏపీ సీఎం ని కలవడానికి ప్రముఖులు అంతా అమరావతికి వెళితే అరవింద్ గారు తన బిజినెస్ విస్తరణ కోసం చెన్నై వెళ్లారని తెలుస్తుంది. వారానికో సినిమా ని రిలీజ్ చేస్తూ తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ.. చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయిన ఆహా ఓటిటిని అక్కడ తమిళంలోనూ అంతే సక్సెస్ చేసే ప్లాన్ లో ఆహా యాజమాన్యం ఉంది. 

Aha Arambham launch:

Aha Tamil OTT App launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ