Advertisementt

కళ కళలాడే పండగ 36 సెకండ్స్

Fri 11th Feb 2022 05:31 PM
mahesh babu,keerty suresh,parasuram,sarkaru vaari paata kalaavati promo out,sarkaru vaari paata movie  కళ కళలాడే పండగ 36 సెకండ్స్
Sarkaru Vaari Paata Kalaavati promo కళ కళలాడే పండగ 36 సెకండ్స్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట ప్రమోషన్స్ ని మెల్లగా స్టార్ట్ చేసేసింది టీం. ఫస్ట్ సింగిల్ అప్ డేట్స్ తోనే విపరీతమైన క్రేజ్ పెంచుతూ.. సింగిల్ పై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ నెల 14 వాలెంటైన్స్ డే సందర్భంగా సర్కారు వారి పాట కళావతి ఫస్ట్ సింగిల్ వస్తుంది. దానికి సంబందించిన పోస్టర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు. మహేష్ - కీర్తి సురేష్ రొమాంటిక్ గా అద్భుతంగా కనిపించారు. తాజాగా సాంగ్ ప్రమోని వదిలారు.

36 సెకండ్స్ గ్లిమ్ప్స్ ని వదిలి కళకళలాడించారు. సాంగ్ ప్రోమో చాలా కలర్ ఫుల్ గా ఉంది. అన్నటికి మించి మహేష్ అందానికి అందరూ ఫిదా నే. ఇప్పటివరకు కీర్తి సురేష్ లుక్స్ విషయంలో భయపడిన మహేష్ ఫాన్స్ అనుమానాలు కళావతి సాంగ్ తో పటాపంచలు చేసింది. మహేష్ తో పోటీపడే అందంతో కళావతిగా కీర్తి సురేష్ కనిపిస్తుంది. మరి కలర్ ఫుల్ బ్యాగ్రౌండ్, కలర్ ఫుల్ లొకేషన్ లో చిత్రీకరించిన కళావతి సాంగ్ 36 సెకెండ్స్ అయినా పండగలా కనిపిస్తుంది. ఎస్.ఎస్ థమన్ మాత్రం సాంగ్ పై, సినిమాపై తన మ్యూజిక్ తో విపరీతమైన అంచనాలు పెంచేసాడు. 

Sarkaru Vaari Paata Kalaavati promo:

Sarkaru Vaari Paata Kalaavati promo out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ