నిన్న గురువారం టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి అధ్యక్షతన ఏపీ సీఎం ని కలిసి ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి జగన్ సహాయం కోరి, కొన్ని విషయాల్లో అనుమతులు పొంది మీడియా సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి థాంక్స్ ల మీద థాంక్స్ లు చెప్పారు చిరు అండ్ కో. మెగాస్టార్ చిరు ఈ సమస్య పరిష్కారానికి ముందు నిలబడ్డారని మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి.. చిరు కి థాంక్స్ చెబుతూ.. ఏపీ సీఎం ని తెగ పొగిడేశారు. మరి టికెట్ రేట్స్ ఇష్యు లో చాలామంది ప్రొడ్యూసర్స్, ఇంకా చిరు, నాగ్ వెళ్ళినప్పుడు తీరని సమస్య ఒక్కసారిగా తీరిపోవడంపై అందరికి షాకింగ్ గానే ఉంది. అక్కడ చిరు జగన్ ని అడుక్కున్నట్లుగా ఉంది అది నాకు నచ్ఛలేదు అంటూ కాంట్రవర్సీ దర్శకుడు ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
రామ్ గోపాల్ వర్మ కూడా ఇండస్ట్రీ సమస్యలు, టికెట్ రేట్స్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి ట్వీట్స్ తో చుక్కలు చూపించి, నాని తో భేటీ కూడా అయ్యారు. అలాగే ఏపీ ప్రభుత్వాన్ని మీడియా ఛానల్స్ ద్వారా సూటిగా ప్రశ్నించారు. అదే ఆర్జీవీ నిన్న ఏపీలో జరిగిన జగన్ - ప్రముఖుల మీటింగ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ఓ మెగా అభిమానిగా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా హర్ట్ అయ్యా అని ట్వీట్ చేస్తూ చిరంజీవిని ట్యాగ్ చేశారు వర్మ. ఆతర్వాత వెంటనే ఆ ట్వీట్ డిలేట్ చేసారు. ఆ తర్వాత సూపర్, మెగా, బాహుబలి లెవెల్ బెగ్గింగ్ వల్ల ఇది జరిగినప్పటికీ, అది మెగాస్టార్ వల్ల అయినందుకు నేను సంతోషిస్తున్నాను. వైఎస్ జగన్ వారిని ఆశీర్వదించారు.. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలులను నేను ఎంతో అభినందిస్తున్నాను. వైఎస్ జగన్ చేతులు ముడుచుకున్నారు అంటూ ట్వీట్ చేస్తూ జగన్ ని ట్యాగ్ చేసారు ఆర్జీవీ.