ప్రభాస్ ప్రాజెక్ట్ కె తో సౌత్ కి ఎంట్రీ ఇస్తున్న దీపికా పదుకొనే ఎన్టీఆర్, అల్లు అర్జున్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ - నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె లో దీపికా పదుకొనే ని హీరోయిన్ గా ఎంపిక చేసి ఆమెకి నాగ్ అశ్విన్ మహానటి సినిమా చూపించాడు. అప్పుడే దీపికా సౌత్ సినిమాలని అప్రిశేట్ చేసింది. తాజాగా దీపికా ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె షూటింగ్ కి హారవుతుంది. ఈమధ్యన బాలీవుడ్ భామలు సౌత్ ఏరోలని ఎత్తేస్తున్నట్టుగా .. దీపికా పదుకొనే కూడా ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల గురించి మాట్లాడి షాకిచ్చింది. గెహ్రియాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దీపికా ఎన్టీఆర్, అల్లు అర్జున్ గురించి మాట్లాడింది.
ఎన్టీఆర్ పర్సనాలిటీ ఇష్టం అంటూ.. అతని యాక్టింగ్ స్కిల్స్ తనకు చాలా నచ్చుతాయని.. ఎన్టీఆర్ తో కలిసి నటించేందుకు ఎప్పుడు అవకాశం వచ్చినా అతనితో నటించేందుకు సిద్ధమే అంటూ చెప్పింది. అంతేకాకుండా మరో స్టార్ హీరో అల్లు అర్జున్ అన్నా చాలా ఇష్టమని అతనితో కలిసి వర్క్ చేసేందుకు రెడీ అంటుంది దీపికా. ప్రస్తుతం ఈ ఇద్దరు సౌత్ హీరోలపైనే తన ఫోకస్ ఎక్కువగా ఉన్నట్లు గా చెప్పింది. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులపై మాత్రమే కాదు, అక్కడి స్టార్స్ పై కూడా చెరిగిపోని ముద్ర వేసాడు. పుష్ప చూసాక అలియా భట్ అల్లు అర్జున్ తో నటించడం అనేది తన ఫ్యామిలీ డిమాండ్ అంటే.. ఇప్పుడు దీపికా పదుకొనే ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నా అని చెప్పడం.. నార్త్ లో సౌత్ రేంజ్ పెరిగింది అని చెప్పడానికి చక్కని ఉదాహరణ.