Advertisementt

జాక్ పాట్ కొట్టేసిన రష్మిక?

Thu 10th Feb 2022 12:41 PM
rashmika mandanna,vijay,thalapathy 66,vamsi paidipalli,dil raju,ram charan  జాక్ పాట్ కొట్టేసిన రష్మిక?
Vijay to romance Rashmika? జాక్ పాట్ కొట్టేసిన రష్మిక?
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న లక్కు మాములుగా లేదు. అదృష్టం ఆమెని జిడ్డులా పట్టుకుంది. అందుకే స్టార్ హీరోల ఛాన్స్ లు రష్మిక తలుపుతడుతున్నాయి. టాలీవుడ్ మోస్ట్ లక్కియస్ట్ హీరోయిన్ అనగానే రష్మిక అనేస్తారు. అలా ఉంది ఆమె అవకాశాల వెల్లువ. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లో మెరిసిన రష్మిక.. అటు బాలీవుడ్ సినిమాలతో బాగా బిజీ తారగా మారింది. తరచూ ముంబై ఫ్లైట్ ఎక్కుతున్న రష్మిక.. ఇటు పుష్ప 2 షూటింగ్ కోసం రెడీ అవుతుంది. అయితే రశ్మికని రామ్ చరణ్ - జెర్సీ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ లోకి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రాజెక్ట్ లో రష్మిక, రామ్ చరణ్ తో రొమాన్స్ పక్కా అంటున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, దిల్ రాజు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంబోలో మొదలు కాబోతున్న పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా  రశ్మిక పేరు పరిశీలుస్తున్నారనే టాక్ మొదలైంది. తెలుగు, హిందీలో క్రేజీ హీరోయిన్ గా ఉన్న రష్మిక, విజయ్ సరసన బావుంటుంది అని, వంశి పైడిపల్లి రష్మిక ని సంప్రదించారని అంటున్నారు. త్వరలోనే మొదలు కాబోయే ఈ ప్రాజెక్ట్ లోకి రశ్మికని ఆహ్వానించబోతున్నారని తెలుస్తుంది. ఇక విజయ్ ప్రస్తుతం బీస్ట్ మూవీ చేస్తున్నారు. ఆ మూవీ అవ్వగానే వంశి పైడిపల్లి ప్రాజెక్ట్ లోకి వస్తారట విజయ్. రామ్ చరణ్, విజయ్ ప్రాజెక్ట్స్ గనక రష్మికకి తగిలాయంటే.. నిజంగా రష్మిక జాక్ పాట్ కొట్టేసినట్లే. 

Vijay to romance Rashmika?:

Rashmika Mandanna to pair with Vijay in Thalapathy 66?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ