Advertisementt

అది చిరు చేతికి అందితే అంతా క్లియర్

Wed 09th Feb 2022 05:33 PM
tollywood,megastar chiru,cm ys jagan,ticket rates,producers  అది చిరు చేతికి అందితే అంతా క్లియర్
Tollywood Biggies Meeting With CM Ys Jagan అది చిరు చేతికి అందితే అంతా క్లియర్
Advertisement
Ads by CJ

రేపు గురువారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో టాలీవుడ్ పెద్దల కీలక సమావేశం జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ మీటింగ్ కి చిరు తో పాటు ఇతర స్టార్ హీరోలు కూడా అటెండ్ అవుతారని చాలా పేర్లు వినిపిస్తున్నాయి. చివరిగా చిరు తో ఈ మీటింగ్ కి వచ్చేదెవరో? జగన్ ని కలిసేదెవరో? రేపు రివీల్ అవుతుంది. అయితే ఇప్పటికే టికెట్ రేట్స్ సవరణ నిమిత్తం ఓ కొత్త జీవో సిద్ధం చేసారని రేపు సీఎం జగన్ చేతుల మీదుగా చిరంజీవికి అందిస్తారని సమాచారం. ఇప్పటికే సీఎం జగన్ తో మంత్రి పేర్ని నాని భేటీ అయ్యి ఈ టికెట్ రేట్స్ ఇష్యు, టాలీవడ్ పెద్దల సమావేశం పై చర్చించినట్లు తెలుస్తోంది.

అలా ముఖ్యమంత్రి జగన్ ఆమోదం మేరకు సిద్ధం చేసిన జీవో ని టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవికి అందించవచ్చని అంటున్నారు. అదే గనక జరిగితే అంతా క్లియర్ అయిపోయినట్లే. ఓ వైపు తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్ద గా చిరంజీవి ని గుర్తించినట్టే అవుతుంది. మరోవైపు తెలుగు సినిమాల వరస విడుదలల కార్యక్రమానికి అంతా క్లియర్ అవుతుంది. మరి రేపు జరగబోయే కీలక సమావేశంలో ఎలాంటి కొత్త విషయాలు తెలుస్తాయో.. చిరు వెంట వెళ్లే ఇతర స్టార్ హీరోలెవరో రేపు ఉదయానికి తేలిపోతుంది.

Tollywood Biggies Meeting With CM Ys Jagan:

Megastar meeting with Jagan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ