ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వంతో సినీ పెద్దల మీటింగ్ జరిగిన ప్రతీసారి మెగాస్టార్ వెంట నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు, రాజమౌళి లాంటి పెద్దలు వెళ్లడమే కాదు, స్టార్ హీరోలు వెళ్ళలేదు. చిరు కాకుండా టాప్ ప్రొడ్యూసర్స్ కూడా ఏపీ మినిస్టర్స్ నానిని కలిశారు. అప్పుడు కూడా స్టార్ హీరోలెవరు వెళ్ళలేదు. మహేష్ బాబు, ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ లాంటి వాళ్ళు వెళితే ఈ సమస్య త్వరగా పరిష్కారమవుతుంది అనే ఆలోచనలు చాలామందిలో ఉన్నా.. ఈ హీరోలెవరూ పెద్దల మీటింగ్ కి సహకరించలేదు. గతంలో మెగాస్టార్ చిరు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకి ఫోన్ కూడా చేసారని అన్నారు. కానీ వారు సానుకూలంగా లేకపోబట్టే చిరు, నాగార్జున లాంటి వారు జగన్ తో మీటింగ్ పెట్టారని అన్నారు.
కానీ రేపు అంటే ఫిబ్రవరి 10 న అమరావతిలో జగన్ ని మీట్ అయ్యేందుకు సినీ పరిశ్రమ కదులుతుంది. మెగాస్టార్ చిరు, నాగార్జున, సురేష్ బాబు, దానయ్య, రాధేశ్యామ్ ప్రొడ్యూసర్ వెళుతున్నారని అన్నా.. రీసెంట్ గా మెగాస్టార్ బృందం వెంట ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు కూడా వెళ్ళబోతున్నారనే న్యూస్ చూస్తే నిజంగా ఇంట్రెస్ట్ కలిగించక మానదు. చిరు, నాగ్ లాంటి పెద్దల వెనుక స్టార్ హీరోలు కూడా మేమున్నామని నిలబడితే.. ఇంకా తిరుగు ఉండదు. ఈ మీటింగ్ సక్సెస్ అవడం ఖాయం అంటున్నారు ఫాన్స్. మరి ఇండస్ట్రీని కాచి ఒడకట్టిన పెద్దల తో యంగ్ బ్లడ్ కూడా కలిస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.
మరి ఏపీ సీఎం జగన్ తో జరగబోయే ఈ మీటింగ్ పై అందరిలో ఇంట్రెస్ట్ అంతకంతకు పెరిగిపోతుంది.