ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aadavaallu Meeku Johaarlu teaser treat on

సినిమా కూడా అంతే రొమాంటిక్ గా ఉంటుందా

Aadavaallu Meeku Johaarlu teaser treat on

గత కొన్నాళ్లుగా సక్సెస్ అనేది రావడం లేదు శర్వానంద్ కి. ఎంతో ఇష్టపడి చేసిన పడి పడి లేచే మనసు కానీ జాను మూవీ కానీ, శ్రీకారం కానీ ఏది శర్వా కి హిట్ ఇవ్వలేదు. ఆఖరికి మాస్ మూవీ మహాసముద్రమూ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత వరసగా రెండు సినిమాలను ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చెందుకు శర్వానంద్ రెడీ అయ్యాడు. ఒకే ఒక జీవితం, ఆడవాళ్లు మీకు జోహార్లు. అందులో ముందుగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ని రిలీజ్ చేస్తున్నాడు శర్వా. ఎందుకంటే ఆ సినిమాతో శర్వా మళ్ళీ నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. ఆ సినిమాకు నేషనల్ క్రష్ రష్మిక ప్లస్ అవుతుంది అని శర్వా నమ్మకం.

ఈ నెల 25 న ఆడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ అని మేకర్స్ ప్రకటించాక.. పోస్టర్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. అంటే చాలా క్యూట్ గా అందంగా రొమాంటిక్ గా వున్న పోస్టర్స్ వదులుతున్నారు. రష్మిక శారీలో చాలా స్టైలిష్ గా, స్వీట్ లుక్స్ తో, స్మైలీ ఫేస్ తో కనబడుతుంటే.. శర్వానంద్ అంతే  స్టయిల్ గా, డీసెంట్ గా కనబడుతున్నాడు. రేపు 10 న విడుదల కాబోయే టీజర్ పై  రీసెంట్ గా విడుదలైన టైటిల్ సాంగ్ అండ్ ఈ పోస్టర్స్ తో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఎంతెలా అంటే.. ఆ పోస్టర్స్ చూసాక శర్వానంద్ - రష్మిక కెమిస్ట్రీపై అంచనాలు పెరిగేలా.. సినిమా కూడా ఇంత రొమాంటిక్ గా ఉంటుందా అనేలా అన్నమాట. హగ్స్, ముద్దులతోనే ఇంప్రెస్స్ చెయ్యక్కర్లేదు, ఇలాంటి క్యూట్ పోస్టర్స్ తోనూ ఇంప్రెస్స్ చెయ్యొచ్చు అని ఆడవాళ్లు మీకు జోహార్లు పోస్టర్స్ చూస్తే తెలుస్తుంది. 

Aadavaallu Meeku Johaarlu teaser on February 10th

sharwanand
rashmika mandanna
aadavaallu meeku johaarlu teaser