అన్ని బావుంటే.. ఈపాటికి ఆర్.ఆర్.ఆర్ మూవీ చూసేసి.. పండగ చేసుకునే వారు ఫాన్స్. అటు టీం కూడా సక్సెస్ టూర్స్ తో బిజీ బిజీ గా గడుపుతుండేవారు. కానీ ఏం చేస్తాం కరోనా అన్ని సంతోషాలని పాడుచేసింది. అయితేనేమి.. రాజమౌళి అప్పుడప్పుడు ఆర్.ఆర్.ఆర్ విషయాలను మీడియా తో పంచుకుంటున్నారు. ఇక గతంలో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా సల్మాన్ ఖాన్, రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ హీరోలు పాల్గొన్న వీడియో ఒకటి టీమ్ షేర్ చేసింది. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ కి మధ్యన ఉన్న తేడాలను రాజమౌళి వివరించడమే కాదు, ఆర్.ఆర్.ఆర్ లో హీరో ల ఇంట్రడక్షన్ సీన్స్, అలాగే చరణ్, ఎన్టీఆర్ గొప్పనటులు అని, తన కెరీర్ లోనే బెస్ట్ సీన్ ఆర్.ఆర్.ఆర్ లో ఒకటి ఉంది అంటూ సినిమాపై అంచనాలు, ఆసక్తిని ఇంకాస్త పెంచేశారు.
ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ మొదలు పెట్టినప్పటినుండే హీరోలని పరిగెత్తించాను అని, చాలా కష్టపెట్టాను అని.. షూటింగ్ మొదటి రోజే చెప్పులు లేకుండా ఎన్టీఆర్ ని అడవుల్లో పరిగెత్తించాను అని, చరణ్ ని అయితే వేలమంది మధ్యలో దుమ్ములో నిలబెట్టాను, అతనికి దేహం నుండి రక్తం కారినా పట్టించుకోలేదని, ఆ ఇంట్రడక్షన్ సీన్ తన కెరీర్ లోనే బెస్ట్ సీన్ అని చెప్పారు రాజమౌళి. అలాగే ట్రైలర్ లో చూపించిన బ్రిడ్జ్ సన్నివేశాన్ని రెండో రోజే చిత్రీకరించామని, దాని కోసం హీరోలిద్దరూ తాళ్ల సహాయంతో 60 అడుగులు ఎత్తు గాల్లోకి ఎగిరారని, 1200 మంది ఆర్టిస్ట్ లతో 65 రోజుల పాటు ఇంటర్వెల్ సీన్ షూట్ చేశామని, ఇంకా సినిమాలో ఓ సీన్ అయితే చూస్తున్నంత సేపు గుండెవేగంగా కొట్టుకుంటుంది అని, అందుకే ట్రైలర్ లో కానీ, టీజర్ లో కానీ అది చూపించకుండా దాచేశామని చెప్పారు.
ఇక సాంగ్స్, యాక్షన్ సన్నివేశాల కోసం ఎన్టీఆర్, చరణ్ శ్రమించారని.. ఓ సన్నివేశం పూర్తవ్వగానే.. చరణ్ ని బాగా చేసావు అని హాగ్ చేసుకుంటాను. బావుందా సర్, మీకు ఓకె.. మీకు నచ్చితే ఓకె సర్ అంటాడు. అదే ఎన్టీఆర్ అయితే.. తన పెరఫార్మెన్స్ గురించి చెప్పేలోపు, జక్కన్న అదరగొట్టేసా కదా అంటాడు. అది తనపై తనకున్న విశ్వాసం. అలాంటి గొప్ప నటులతో కలిసి పని చేసే అవకాశం తనకి దక్కింది అంటూ రాజమౌళి చెప్పారు.