Advertisementt

చిరు తో పాటుగా ఏపీకి వారు కూడా

Tue 08th Feb 2022 04:46 PM
chiranjeevi,ap cm jagan,tollywoo top producers,ys jagan  చిరు తో పాటుగా ఏపీకి వారు కూడా
Megastar To Meet AP CM On FEB 10th చిరు తో పాటుగా ఏపీకి వారు కూడా
Advertisement
Ads by CJ

ఈరోజు మంగళవారం జరగాల్సిన  టాలీవుడ్ కీలక భేటీ అనుకోకుండా వాయిదా పడింది. చిరంజీవి అధ్యక్షతన జరగాల్సిన ఈ మీటింగ్ కొంతమంది ప్రముఖులు అందుబాటులో లేని కారణంగానూ, మరికొందరు సానుకూలంగా లేకపోవడంతో వాయిదాపడినట్లుగా తెలుస్తుంది. మరోపక్క  ఏపీ సీఎం ఈ రోజు మంగళవారం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి తో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిసి చర్చించడం హాట్ టాపిక్ అయ్యింది. సినిమా టికెర్ రేట్స్ ఇష్యు, సినిమా థియేటర్స్ విషయంపై మంత్రి పేర్ని నాని, సీఎం జగన్ చర్చించినట్లుగా తెలుస్తుంది. అయితే టాలీవుడ్ నుండి ఏపీ సీఎం జగన్ ని కలిసేందుకు మెగాస్టార్ చిరంజీవి మరోసారి రెడీ అయ్యారు. 

ఇంతకుముందు ఒంటరిగా వెళ్లి జగన్ ని కలిసి లంచ్ చేసిన చిరంజీవి.. ఈసారి టాలీవుడ్ ప్రముఖులతో కలిసి జగన్ ని కలవబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా నాగార్జున, రాధేశ్యామ్ నిర్మాత, ఆర్.ఆర్.ఆర్ నిర్మాత దానయ్య, సురేష్ బాబు, దిల్ రాజు మరికొంతమంది ప్రముఖులు ఏపీ సీఎం జగన్ ని కలిసేందుకు ఈ నెల 10 న అమరావతికి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. జగన్ తో ప్రముఖుల భేటీలో ముఖ్యంగా థియేటర్స్ సమస్యల గురించి, టికెట్ రేట్స్ పెంచుకునే విషయము, అలాగే బెన్ఫిట్ షోస్ నిర్వహించుకోవడానికి అనుమతుల గురించి చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Megastar To Meet AP CM On FEB 10th:

Chiru and Tollywood top producers To Meet YS Jagan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ