భీమ్లా నాయక్ ఈ నెల 25 న విడుదలవుతుందా? లేదంటే ఏప్రిల్ 1 న విడుదలవుతుందా? అనే కన్ఫ్యూషన్ కి తెరపడబోతుంది అంటున్నారు. అంటే భీమ్లా నాయక్ మేకర్స్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చెయ్యబోతున్నారట. ఏపీలో పరిస్థితి చక్కబడితే ఫిబ్రవరి 25 నే సినిమా అంటున్నారు మేకర్స్. ఆ విషయమై క్లారిటీ లేకుండా చేసారు. రీసెంట్ గా భీమ్లా నాయక్ పోస్ట్ ప్రొడక్షన్ డన్ అని అలాగే భీమ్లా నాయక్ డబ్బింగ్ పనులతో పాటుగా రీ రికార్డింగ్ అన్ని ఫినిష్ అయ్యాయట. ఎలాంటి వర్క్ పెండింగ్ లేదట. దానితో ఫిబ్రవరి 25 న సినిమా రిలీజ్ చెయ్యడానికి ఎలాంటి అడ్డంకి లేకపోయినా ఏపీ సీఎం జగన్ ప్రకటన కోసమే మేకర్స్ వెయిటింగ్ అంటున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం #BheemlaNayakOn25thFeb అంటూ ట్విట్టర్ లో హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 25 నే భీమ్లా నాయక్ అని, త్వరలోనే అఫీషియల్ అనౌన్సమెంట్ అంటూ వారు తెగ హడావిడి చేస్తున్నారు. మరి మేకర్స్ కూడా త్వరగా ఏదో ఒక డెసిషన్ తీసుకుని వెంటనే భీమ్లా నాయక్ డేట్ పై ప్రకటన ఇస్తే.. ఫాన్స్ కూల్ అవుతారు. మరోపక్క భీమ్లా నాయక్ మేకర్స్ కూడా ఫిబ్రవరి 25 న సినిమా ని రిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారని, డేట్ ప్రకటించి ప్రమోషన్స్ మొదలు పెట్టెయ్యబోతున్నారని తెలుస్తుంది.