Advertisementt

సమంత పద్దతిని ఫాలో అవుతోంది

Tue 08th Feb 2022 12:24 PM
deepthi sunaina,bigg boss fame,samantha quotations,samantha,social media  సమంత పద్దతిని ఫాలో అవుతోంది
Deepthi Sunaina following Samantha సమంత పద్దతిని ఫాలో అవుతోంది
Advertisement
Ads by CJ

గత ఏడాది సమంత - నాగ చైతన్య డివోర్స్ ఇష్యు పెద్ద సెన్సేషన్ అయ్యింది. సమంత చైతు తో విడాకులు తీసుకుంటున్న విషయాన్ని షేర్ చేసాక.. రకరకాల కొటేషన్స్ తో తన బాధని సోషల్ మీడియా ముందు పెట్టింది. ఆ కొటేషన్స్ తో అభిమానులని అయోమయంలో పడేసింది. అయితే ఇప్పుడు సమంత నే ఫాలో అవుతుంది ఓ బిగ్ బాస్ బ్యూటీ. గత ఏడాది సమంత డివోర్స్ మేటర్ ఎంతగా సంచలనం అయ్యిందో.. ఈ ఏడాది ఆరంభంలో బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన తన బాయ్ ఫ్రెండ్ కి కటిఫ్ చెప్పడం అంతే సంచలనం అయ్యింది. అప్పుడే మొదలు పెట్టింది దీప్తి సునయన సమంత ని ఫాలో అవడం. సోషల్ మీడియా ద్వారా షణ్ముఖ్ కి బ్రేకప్ ప్రకటించి కెరీర్ ముఖ్యం అంది.

అప్పటినుండి సోషల్ మీడియాలో రకరకాల కొటేషన్స్ ని దింపింది. సమంత విడాకుల తర్వాత తల్లిపై ప్రేమ కురిపిస్తే.. దీప్తి సునయన తండ్రిపై ప్రేమని చాటి చెప్పింది. ఇక రీసెంట్ గా సమంత సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించడం నాకు నచ్చదు.. నేను అనుకోకుండా మాట్లాడేమాటలకు అందరూ ఎలా ఆశ్చర్యపోతోంటారో నేను కూడా అలానే ఆశ్చర్యపోతుంటాను అంటూ రాసుకొచ్చింది. అదే కొటేషన్ ని దీప్తి సునయన తన స్టోరీ లో షేర్ చేసింది. ఎప్పుడెలా ఉంటామో ఆ దేవుడికే ఎరుక అంటూ కొటేషన్ ని పెట్టింది. ప్రతి విషయంలోనూ దీప్తి సునయన సమంత నే ఫాలో అవుతుంది. మరి ఈలెక్కన సమంత అంత పాపులర్ దీప్తి అవుతుందేమో చూద్దాం. 

Deepthi Sunaina following Samantha:

Deepthi Sunaina following Samantha social media quotations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ